మాటిచ్చి.. ముఖం చాటేస్తున్నారు..!

ABN , First Publish Date - 2022-12-06T22:28:40+05:30 IST

ఎన్నికలకు ముం దు తన అర్హతకు తగిన ఉద్యోగం కచ్చితంగా ఇప్పి స్తానని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు మా ట దాటేస్తున్నారని దివ్యాంగురాలు కన్నీటి ప ర్యంతమైంది.

మాటిచ్చి.. ముఖం చాటేస్తున్నారు..!
ఆవేదన వ్యక్తం చేస్తున్న సురేఖ

నెరవేరని ఎమ్మెల్యే బుర్రా హామీ

కనిగిరి, డిసెంబరు 6 : ఎన్నికలకు ముం దు తన అర్హతకు తగిన ఉద్యోగం కచ్చితంగా ఇప్పి స్తానని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు మా ట దాటేస్తున్నారని దివ్యాంగురాలు కన్నీటి ప ర్యంతమైంది. 2019 ఎన్నికల్లో, అంతకు ముందు వైసీపీ గెలుపునకు ఎంతో కృషి చేసిన తన తండ్రిపై గౌరవంతో దివ్యాంగు రాలినైన తనకు ఉద్యోగం ఇప్పిస్తానని ఎమ్మె ల్యే మాట ఇచ్చారని మండలంలోని దిరిశవంచ గ్రామానికి చెందిన దివ్యాంగురాలు గారపాటి సురేఖ ఆవేదన వెలి బుచ్చింది. గతంలో వారి ఆదేశాలు, సూచనల మేరకు ఉద్యోగం నిమిత్తం బ్యాక్‌లాక్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తాను మా ట్లాడాను ఒంగోలు వెళ్లి కలవాలని ఎమ్మెల్యే సారూ చెప్తే ఒంగోలులో తిరగని కా ర్యాలయమంటూ లేదని వాపోయింది. తన వైకల్యాన్ని కూడా లెక్కచేయకుండా, ప చ్చి బాలింతగా ఉన్నప్పుడు కూడా కారులో పలు మార్లు ఒంగోలు తిరగానని విల పించింది. దిరిశవంచ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్త పోస్టు ఉందని అది తనకే ఇప్పిస్తానని నమ్మించి బీసీ కోటా కింద ఆ పోస్టును నియమించారని ఆమె ఆరోపించింది. అది కాకపోతే వేరే చోట ఉద్యోగంలో అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటానని సాక్ష్యాత్తు ఎమ్మెల్యే బుర్రా సారే చెప్పారని దివ్యాంగ మహిళ తెలిపింది. ఇప్పుడు తనకు ఇద్దరు పిల్లలు ఉన్నా రని, తన తండ్రి మరణంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నానని చెప్పింది. మంగళవారం దిరిశవంచ గ్రామంలో గడప గడపకు కార్యక్రమానికి వస్తున్న ఎమ్మె ల్యేని కలుద్దామని వెళ్తే స్థానిక సర్పంచ్‌ గుంటూరి వెంకటేశ్వర్లు కలవ నీయకుండా తన ఇంటిని దాటి కార్యక్రమం మొదలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. వైసీపీ నాయకుడు కత్తి యోగి మాట్లాడుతూ దివ్యాంగురాలు సురేఖకు ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు పోస్టులు ఏ శాఖలో ఖాళీలు ఉన్నాయో ఎమ్మెల్యే విచా రించారని, ప్రస్థుతానికి సురేఖ విద్యార్హతకు తగిన ఉద్యోగాలు లేకపోవటంతో ఇప్పించేందుకు వీలు కాలేదని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు సురేఖకు తప్పనిసరిగా ఉద్యోగం ఇప్పించాలని చెప్తున్నట్లు తెలిపా

Updated Date - 2022-12-06T23:18:57+05:30 IST