మార్కాపురం ఓఎస్డీ చౌడేశ్వరి బదిలీ

ABN , First Publish Date - 2022-04-05T06:36:21+05:30 IST

మార్కాపురం ఓఎస్డీగా పనిచేస్తున్న కె.చౌడేశ్వరి బదిలీ అయ్యారు. ఈమేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

మార్కాపురం ఓఎస్డీ  చౌడేశ్వరి బదిలీ

ఒంగోలు(క్రైం), ఏప్రిల్‌ 4: మార్కాపురం ఓఎస్డీగా పనిచేస్తున్న కె.చౌడేశ్వరి బదిలీ అయ్యారు. ఈమేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఒంగోలులో ఏఎస్పీగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న చౌడేశ్వరిని హెడ్‌క్వార్టర్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. చౌడేశ్వరి జిల్లాలో కీలకమైన కేసుల దర్యాప్తులో తనదైన పాత్ర పోషించి పోలీస్‌ శాఖ ప్రతిష్ఠ పెంచారు. మూడునెలల క్రితం టంగుటూరులో జరిగిన తల్లీకూతుళ్ల హత్యకేసు ఛేదించడంలో అహర్నిశలూ కష్టపడ్డారు. అదేవిధంగా ఇటీవల వైపాలెం రియల్టర్‌ హత్యకేసులో నిందితులను పట్టుకోవడంలోనూ ఆమె కీలకపాత్ర ఉంది. కురిచేడులో గతేడాది శానిటైజర్లు తాగి మృతిచెందిన కేసులో ప్రతిష్ఠాత్మకంగా పని చేశారు.Read more