ఉపాధి కూలీలపై పిచ్చి కుక్క దాడి

ABN , First Publish Date - 2022-06-11T05:37:22+05:30 IST

కొనకనమిట్ల మండలం చినారికట్ల గ్రామంలో ఉపాధికూలీలపై శుక్రవారం పిచ్చికుక్క దాడి చేసింది. ఉదయాన్నే ఉపాధి కూలీ పనులకు ఒంటరిగా వెళుతున్న పిల్లి చెన్నమ్మపై పిచ్చి కుక్క దాడి చేసి చేయి, కాలు, ముఖంపై కరిచి తీవ్రగాయం చేసింది. ఆమె అరుపులు, కేకలు గమనించి సమీప పొలాల్లో ఉన్న వారు కుక్కను అదిలించడంతో అది వెళ్లిపోయింది. వెంటనే స్థానికులు 108కి సమాచారం అందించారు.

ఉపాధి కూలీలపై పిచ్చి కుక్క దాడి
కుక్క దాడిలో తీవ్రగాయాలయిన చెన్నమ్మ , క్షతగాత్రులను 108లో తరలిస్తున్న దృశ్యం

ఏడుగురికి తీవ్రగాయాలు

ఆరుగురు ఒంగోలు రిమ్స్‌కు తరలింపు

కొనకనమిట్ల, పొదిలి రూరల్‌, జూన్‌ 10 : కొనకనమిట్ల మండలం చినారికట్ల గ్రామంలో ఉపాధికూలీలపై శుక్రవారం పిచ్చికుక్క దాడి చేసింది.  ఉదయాన్నే ఉపాధి కూలీ పనులకు ఒంటరిగా వెళుతున్న  పిల్లి చెన్నమ్మపై పిచ్చి కుక్క దాడి చేసి చేయి, కాలు, ముఖంపై కరిచి తీవ్రగాయం చేసింది. ఆమె అరుపులు, కేకలు గమనించి సమీప పొలాల్లో ఉన్న వారు కుక్కను అదిలించడంతో అది వెళ్లిపోయింది.  వెంటనే స్థానికులు 108కి సమాచారం అందించారు.  పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రఽథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 10 గంటలకు  పనులు ముగించుకొని మిగిలిన కూలీలు తిరిగి వస్తున్న సమయంలో అదే పిచ్చికుక్క తోటా శ్రీరాములు, తోట యోగిరాములు, కంకణంపాటి కోటేశ్వరిపై దాడి చేసింది. కుక్కను కూలీలు తరమడంతో ఆ కుక్క గ్రామంలోకి పరుగు పెట్టింది. గ్రామంలోని మారవతు అక్కమ్మ, బరిగె ఆదిలక్ష్మమ్మ, ఏలూరి వెంకటనర్సయ్యపై దాడిచేసి గాయపరచింది. అంతటితో ఆగకుండా ఒక ఎద్దును, గేదెను, దూడలను కరిచింది. పిచ్చికుక్క దాడితో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. అందరూ కలిసి కుక్కను వెంబడించి కర్రలతో కొట్టి చంపివేశారు. క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆరుగురిని ఒంగోలు రిమ్స్‌ వైద్యశాలకు తరలించారు. 

Updated Date - 2022-06-11T05:37:22+05:30 IST