రెస్టారెంట్‌లో మద్యం బాటిళ్లు స్వాధీనం

ABN , First Publish Date - 2022-12-30T00:18:18+05:30 IST

అద్దంకిలో బార్‌లను తలపించేలా రెస్టారెం ట్‌లు నిర్వహిస్తున్నారన్న విషయం మరోసారి తేటతెల్లమైంది. .కొత్త సంవత్సరం వేడుకలకు అందుబాటులో ఉండేలా పలు రెస్టారెంట్‌ల ని ర్వాహకులు భారీగా మద్యం నిల్వలు ఉంచినట్లు తెలుస్తుంది.

రెస్టారెంట్‌లో మద్యం బాటిళ్లు స్వాధీనం

అద్దంకి, డిసెంబరు 29: అద్దంకిలో బార్‌లను తలపించేలా రెస్టారెం ట్‌లు నిర్వహిస్తున్నారన్న విషయం మరోసారి తేటతెల్లమైంది. .కొత్త సంవత్సరం వేడుకలకు అందుబాటులో ఉండేలా పలు రెస్టారెంట్‌ల ని ర్వాహకులు భారీగా మద్యం నిల్వలు ఉంచినట్లు తెలుస్తుంది. ఈక్ర మంలోనే గురువారం రాత్రి ఎక్సైజ్‌ విజిలెన్స్‌ ఎస్‌ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పట్టణంలోని మీనాక్షి రెస్టారెంట్‌లో తనిఖీలు చేయగా పె ద్ద మొత్తంలో మద్యం బాటిళ్ళు పట్టుబడ్డాయి. అనంతరం మీనాక్షి రె స్టారెంట్‌ నిర్వహకుడు నివాసం ఉండే సంజీవనగర్‌లో ఇంట్లో తనిఖీలు చేయగా అక్కడ కూడా పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు పట్టుబడ్డా యి. పట్టుబడ్డ మద్యంలో గోవా, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలతో పా టు పలు రాష్ర్టాలకు చెందిన మద్యం ఉంది. దీనిని బట్టి నిత్యం పెద్ద మొత్తంలో మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు తేటతెల్లమైంది. పట్టు బడ్డ మద్యాన్ని సెబ్‌ సర్కిల్‌ కార్యాలయానికి తరలించారు. 94 మద్యం బాటిళ్ళు పట్టుబడినట్టు తెలుస్తుంది. ఇంకా ఇతర ప్రాంతాలలో కూడా నిల్వ ఉంచి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెస్టా రెంట్‌లో పనిచేసే ఇద్దరు వ్యక్తులను కూడా సెబ్‌ అధికారులు అదుపు లోకి తీసుకున్నారు. సెబ్‌ ఎస్సై శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-12-30T00:18:22+05:30 IST