ఐక్యంగా ఉందాం .. అభివృద్ధిలో ముందుందాం

ABN , First Publish Date - 2022-11-20T22:59:14+05:30 IST

అందరం ఐకమత్యంగా ఉందాం. కలసికట్టుగా ప్రయాణం చేద్దాం. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటాం.

ఐక్యంగా ఉందాం .. అభివృద్ధిలో ముందుందాం

ఎమ్మెల్యే బలరాం, వెంకటేష్‌

కొత్తపేట(చీరాల), నవంబరు 20 : అందరం ఐకమత్యంగా ఉందాం. కలసికట్టుగా ప్రయాణం చేద్దాం. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటాం. అభి వృద్ధిలో ముందుందామని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, వైసీపీ నియో జక వర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌లు చెప్పారు. కుందేరు ఒడ్డున నిర్మాణంలో ఉన్న యాదవ సాజాజికవర్గ కమ్యూనిటీ హాల్‌ వద్ద ఆదివారం యాదవ పెద్దల ఆధ్వ ర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావుతో కలసి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవ సోద రులకు ఎప్పుడు సముచితస్ధానం ఉంటుందన్నారు. కమ్యూనిటీ హాలు అభివృద్ధికి త మ వంతు సహకారం అందిస్తామన్నారు. పలు అంశాలపై చర్చించుకున్నారు. ఉమ్మ డి అవసరాల నేపథ్యంలో నియోజకవర్గ స్ధాయిలో ఉన్న సమస్యలను వారు బలరాం, వెంకటేష్‌ దృష్టికి తెచ్చారు. వాటి పరిష్కారానికి వారు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో నియోజకవర్గపరిధిలోని పలువురు యాదవ సామాజికవర్గ పెద్దలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక భావం అందరికీ అవసరం

ఆధ్యాత్మిక భావం ప్రతి ఒక్కరికీ అవసరమని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌ చె ప్పారు. ఆదివారం వారు పలు ఆఽధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మున్సిపల్‌ పరి ధిలోని 28వ వార్డులో కౌన్సిలర్‌ కీర్తి వెంకట్రావు(కెవి) తదితర అయ్యప్పస్వామి మాలధారులు ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్పస్వామి పడిపూజా మహోత్సవంలో వా రు పాల్గొన్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారికి హారతిఇచ్చారు. తరువాత వెంకటేష్‌ వేటపాలెం మండలం దేశాయిపేట శ్రీ పార్వతి సమేత రామలింగ కోటేశ్వర దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కొత్తపేట పంచాయితీ పం చాయితీ పరిధిలో సూర్యబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన 13వ కార్తీక వనసమారాధన మహోత్సవంలో పాల్గొన్నారు. తదనంతం చీరాల మండలం తోట వారిపాలెంలో నూతనంగా నిర్మించిన రోడ్డును పరిశీలించారు. స్థాకులతో మాట్లాడా రు. ఆయా కార్యక్రమాల్లో భక్తులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-20T22:59:14+05:30 IST

Read more