రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనక్కు నడిపించారు

ABN , First Publish Date - 2022-04-10T06:34:20+05:30 IST

ఒక్క చాన్స్‌ అంటూ వచ్చిన వైసీపీ పాలకులు రాష్ట్ర అభివృద్ధిని 25 ఏళ్లు వెనక్కు నెట్టారని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనక్కు నడిపించారు
గిద్దలూరులో నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి
గిద్దలూరు, ఏప్రిల్‌ 9 :
ఒక్క చాన్స్‌ అంటూ వచ్చిన వైసీపీ పాలకులు రాష్ట్ర అభివృద్ధిని 25 ఏళ్లు వెనక్కు నెట్టారని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. పెంచిన విద్యుత్‌చార్జీలను తగ్గించాలని, అప్రకటిత విద్యుత్‌ కోతలను ఎత్తివేయాలని మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో  లాంతర్లు, కొవ్వొత్తులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం 18వ వార్డులో జరిగిన గౌరవసభలో అశోక్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అసమ ర్ధ పాలనతో రాష్ట్రం అంధకారంలో పడింద న్నా రు. అప్రకటిత విద్యుత్‌ కోతలను ఎత్తివేయాలని, పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో పట్టణ పట్టణాధ్యక్షుడు షాన్షావలి, మున్సిపల్‌ కౌన్సిలర్‌ చంద్రశేఖర్‌యాదవ్‌ నాయకులు పాల్గొన్నారు.
వైసీపీని వీడి టీడీపీలోకి 
రాచర్లకు చెందిన 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి నివాస గృహానికి రాచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు యోగానంద్‌, టీడీపీ పార్లమెంటు కార్యదర్శి జీవనేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో 30 కుటుంబాలు వెళ్లి పార్టీలో చేరారు. వారందరికీ అశోక్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. 
పెద్దారవీడు(మార్కాపురం) : వైసీపీ పాలన లో రాష్ట్రం అధోగతి పాలైందని టీడీపీ నాయకు లు ధ్వజమెత్తారు. మండలంలోని దేవరాజు గట్టులో మండల స్థాయి టీడీపీ సమ న్వయ కమిటీ సమా వేశం శనివారం జరి గింది. ఈ సందర్భం గా టీడీపీ మండల కన్వీనర్‌ మెట్టు శ్రీనివాసరెడ్డి మాట్లా డుతూ వైసీపీ పాలనలో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.  అనంతరం విద్యుత్‌ కోతలు, పెంచిన విద్యుత్‌ చార్జీలకు నిరసనగా కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహిం చారు. కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు గొట్టం శ్రీనివాసరెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్మా గంగరాజు, టీడీపీ నాయకులు జడ్డా రవి, ఎస్‌.కాశీరావు, దండా వెంకటేశ్వరరెడ్డి, లింగాల అబ్రహం, పాముల పోలురాజు, పార్టీ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
త్రిపురాంతకం : విద్యుత్‌ బిల్లులు పెంచి వైసీ పీ పాలకులు ప్రజల నడ్డివిరుస్తున్నారని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.  స్థానిక కేకే సత్రంలో శనివారం నిర్వహించిన టీడీపీ మండల సమావేశంలో ఆయన మాట్లా డారు. విద్యుత్‌ బిల్లులు, కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని, మరోపక్క పెట్రోల్‌, గ్యాస్‌ ధరల పెరిగి నిత్యావసరాలు చుక్కలనంటు తున్నాయని ఎరిక్షన్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. అంతకముందు బాదుడే బాదుడు పేరుతో నిరసన కార్యక్రమాన్ని వైపాలెం కూడలి నుంచి విద్యుత్‌ ఉప కేంద్రం వరకూ చేపట్టారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు ఆళ్ళ నాసరరెడ్డి, మోటకట్ల శ్రీనివాసరెడ్డి,  నాయకులు దేవినేని చలమయ్య, గుత్తా వెంకటనారాయణ, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు. అనంతరం ఒడ్డుపాలెం సర్పంచ్‌ ముండ్లమూరి పిచ్చయ్యను సన్మానించారు. త్రిపురాంతకం పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా నారబోయిన మాలకొండరాయుడును ఎరిక్సన్‌బాబు ప్రకటించారు.
ఎర్రగొండపాలెం : పెంచిన విద్యుత్‌ చార్జీలు, వైసీపీ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని టీడీపీ నాయకులు శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ మండల పార్టీ సమావేశం శనివారం కార్యాలయంలో జరిగింది. సమావేశంలో నాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు, చేకూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఎరిక్షన్‌బాబును గెలిపించాలని తీర్మానిస్తూ ఆ కాపీని రాష్ట్ర పార్టీకి పంపించారు.

Read more