కారుమంచి సొసైటీ సీఈవో సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2022-11-30T00:54:21+05:30 IST

కారుమంచి ప్రాఽథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సీఈవో ఆత్మకూరి శ్రీకాంత్‌పై వేటుపడింది. అతని ని సస్పెండ్‌ చేస్తూ సొసైటీ అధికార పర్సన్‌ఇన్‌చార్జ్‌ బి.సిహెచ్‌.మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశా రు. సీఈవో శ్రీకాంత్‌ను ప్రాసిక్యూట్‌ చేసేందుకు కలెక్టర్‌ ఆమోదం తెలపడంతో ఆయనపై టంగుటూరు పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు కూడా నమోదైంది.

కారుమంచి సొసైటీ సీఈవో సస్పెన్షన్‌

క్రిమినల్‌ కేసు నమోదు

ఒంగోలు(విద్య), నవంబరు 29 : కారుమంచి ప్రాఽథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సీఈవో ఆత్మకూరి శ్రీకాంత్‌పై వేటుపడింది. అతని ని సస్పెండ్‌ చేస్తూ సొసైటీ అధికార పర్సన్‌ఇన్‌చార్జ్‌ బి.సిహెచ్‌.మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశా రు. సీఈవో శ్రీకాంత్‌ను ప్రాసిక్యూట్‌ చేసేందుకు కలెక్టర్‌ ఆమోదం తెలపడంతో ఆయనపై టంగుటూరు పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు కూడా నమోదైంది. కారుమంచి సొసైటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వరుస కఽథనాలకు అధికారులు స్పందించి సీఈవోపై వేటువేశారు. సొసైటీలో మొత్తం రూ.87.52 లక్షలు స్వాహా జరిగినట్లు విచారణాధికారి బి.కోటవీరయ్య నిగ్గుతేల్చారు. ఈ అక్రమాలకు సంబంధించి మొత్తం 18మందిపై చర్యలకు ఆయన సిఫార్సు చేయగా ఒక్క సీఈవో పైనే చర్యలు తీసుకున్నారు. సహకార శాఖ ఆడిట ర్లు ఇద్దరు, పీడీసీసీ బ్యాంకు సూపర్‌వైజర్లు ఇరువు రిపై కూడా చర్యలకు విచారణాధికారి సిఫార్సు చేశారు. అదేవిధంగా సొసైటీ అధికార పీఈసీగా పనిచేసిన వారు కూడా అక్రమాలను అరికట్టలేదు. దీంతో నిధులు దుర్వినియోగానికి సహకరించినం దున వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఎవరిపైనా చర్యలకు అధికారులు ఉపక్రమించలేదు. దీంతో అధికారుల ఉదాసీనతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-11-30T00:54:21+05:30 IST

Read more