రేపు దొనకొండలో కనకదుర్గమ్మ తిరునాళ్ల

ABN , First Publish Date - 2022-03-17T04:24:09+05:30 IST

మండలకేంద్రమైన దొనకొండలోని కనకదుర్గమ్మ దేవాలయ తిరునాళ్ల వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ధర్మకర్త ధనవేలు తెలిపారు. శుక్రవారం ఉదయం 5గంటలకు అమ్మవారికి అభిషేకాలు, అర్చన హారతి కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. 9 గంటల నుంచి సామూహిక కుంకుమ పూజలు, మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదానం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

రేపు దొనకొండలో కనకదుర్గమ్మ తిరునాళ్ల
వేడుకలకు ముస్తాబవుతున్న కనకదుర్గమ్మ దేవాలయం

 దొనకొండ, మార్చి 16 : మండలకేంద్రమైన దొనకొండలోని కనకదుర్గమ్మ దేవాలయ  తిరునాళ్ల వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ధర్మకర్త ధనవేలు తెలిపారు. శుక్రవారం ఉదయం 5గంటలకు అమ్మవారికి అభిషేకాలు, అర్చన హారతి కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. 9 గంటల నుంచి సామూహిక కుంకుమ పూజలు, మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదానం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. వేడుకల సందర్భంగా దేవాలయాన్ని సర్వాంగసుందరంగా ప్రత్యేక అలంకరణలతో ముస్తాబు చేస్తున్నారు. సాయంత్రం టీడీపీ, వైసీపీ ఆధ్వర్యంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.


Read more