10 వేల అరటి పండ్లతో ప్రసన్నాంజనేయునికి కదళీ ఫలార్చన

ABN , First Publish Date - 2022-09-26T04:42:12+05:30 IST

శిం గరకొండ శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవస్థా నంలో అమావాస్య సందర్బంగా ఆదివారం స్వామి వారికి పది వేల అరటి పండ్లతో కదళీ ఫలార్చన జరిగింది.

10 వేల అరటి పండ్లతో ప్రసన్నాంజనేయునికి కదళీ ఫలార్చన
ప్రత్యేక అలంకరణలో ప్రసన్నాంజనేయస్వామి

శింగరకొండ(అద్దంకి), సెప్టెంబరు 25: శిం గరకొండ శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవస్థా నంలో అమావాస్య సందర్బంగా ఆదివారం స్వామి వారికి పది వేల అరటి పండ్లతో కదళీ ఫలార్చన జరిగింది. ఉభయదాతలుగా న్యూ ఢిల్లీలో నివాసం ఉండే తెల్లమేకల తిరుపత య్య, అంజమ్మ దంపతుల తరపున బంధువు లు, వినుకొండకు చెందిన వట్టం వెంకటరా యుడు కుటుంబసభ్యులు పాల్గొన్నారు. స్వా మి వారికి పూజారులు, వేదపండితులు ఉద యం నిత్య పూజలు, అభిషేకా లు నిర్వహిం చారు. అనంతరం పదివేల అరటిపండ్లతో పూజ నిర్వహించి అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని     ద ర్శించుకున్నారు.


Read more