రీ సర్వేను పరిశీలించిన జేసీ

ABN , First Publish Date - 2022-11-30T22:50:28+05:30 IST

మండలంలోని కడవకుదురు గ్రామంలో జరుగుతున్న రీ సర్వేని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు బుధవారం పరిశీలించారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించి ఆయన అధికారులు, గ్రామ సర్వేయర్లతో మాట్లాడారు.

రీ సర్వేను పరిశీలించిన జేసీ

చినగంజాం, నవంబరు 30 : మండలంలోని కడవకుదురు గ్రామంలో జరుగుతున్న రీ సర్వేని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు బుధవారం పరిశీలించారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించి ఆయన అధికారులు, గ్రామ సర్వేయర్లతో మాట్లాడారు. సమస్యలు ఉన్న సర్వే నెంబర్ల రైతులను పిలించి ముందుగా రీ సర్వే చేయాలని జేసీ గ్రామ సర్వేయర్లను ఆదేశించారు. కడవకుదురు గ్రామంలో రీ సర్వేపై జరిగిన భూమి యొక్క నిర్థారణ పనులను పరిశీలించి, ఎంత వరకు జరిగినందని తహసీల్దార్‌, గ్రామ సర్వేయర్లను అడిగి తెలుసుకున్నారు. భూమి యొక్క నిర్థారణతో పాటు ఎల్‌పీఎం పనులు వెంటనే చేయాలని అన్నారు. విక్టరైజేషన్‌ పూర్తి అయిన వెంటనే రైతులకు 9(2) నోటీసులు అందజేసి సంతకాలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో చీరాల ఆర్డీవో పి.సరోజని, టైనీ డిప్యూటీ కలెక్టర్‌, ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ జాన్‌ ఎల్విన్‌,డీఐవోఎ్‌స. ఎన్‌.శ్రీనివాసరావు, చీరాల తహసీల్దార్‌ జి.ప్రభాకరరావు, మండల సర్వేయర్‌ జీవి.సుబ్బారావు, ఆర్‌ఐ అందె శివశ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్‌ జి.శివకుమారి, వీఆర్వోలు నాగరాజురెడ్డి, ఎ.సుబ్బారావు, గ్రామ సర్వేయర్లు కత్తి రవీంద్ర, సాయికిరణ్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T22:50:43+05:30 IST

Read more