‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ జయప్రదం చేయాలి

ABN , First Publish Date - 2022-11-30T21:57:44+05:30 IST

నేటి నుంచి టీడీపీ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని శ్రేణులు జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పి లుపునిచ్చారు.

 ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ జయప్రదం చేయాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నారాయణరెడ్డి

పొదిలిరూరల్‌, నవంబరు 30 : నేటి నుంచి టీడీపీ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని శ్రేణులు జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పి లుపునిచ్చారు. బుధవారం టీడీపీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం మం డలంలోని తుమ్మగుంట గ్రామం నుంచి గు రు వారం ప్రారంభమవుతుందన్నారు. గ్రామీణ స్థా యి నాయకులు, కార్యకర్తలు సమస్యలపై దృష్టి సారించాలన్నారు. వాటిపై చర్చించుకొని వైసీ పీ పాలనను ఎండగట్టాలన్నారు. వైసీపీ అధికా రంలోకి వచ్చాక దివ్యాంగులకు పింఛ న్‌లు తొలగించేందుకు చూస్తుందన్నారు. ఎప్ప టి నుంచో ఇస్తున్న పెన్షన్‌లకు సర్టిఫికెట్‌లు లేవని కారణం చూపించి, నిబంధనలు వర్తించ వని చెప్పి కోత పెడుతుందని ధ్వజమెత్తారు. 95 శాతం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా మని వైసీపీ పాలకులు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇచ్చిన ప్రతి పథకంలోనూ కోతలు పెడుతున్న విషయాన్ని ప్రజలకు తెలి యజేయాలన్నారు. అబద్ధపు ప్రకటనలు, ప్రచా రాలతో జగన్‌రెడ్డి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్న విషయాన్ని ఇదేంఖర్మ కార్యక్ర మాల్లో ప్రజలకు వివరించాల న్నారు. మీట నొక్కి ప్రజలకు నిలువునా మోసం చేస్తున్నార న్నారు. పాదయాత్రలో ఉపా ధ్యాయ సమస్య లు పరిష్కారిస్తామని మాటి చ్చిన జగన్‌రెడ్డి నేడు టీచర్లను అష్టకష్టాలకు గురిచేస్తున్నార న్నారు. ప్రభుత్వంపై పోరాడు తున్న ఉపాధ్యా యులను ఎన్నికల విధుల నుం చి తప్పించేం దుకు జగన్‌రెడ్డి కుట్ర చేస్తున్నా రని కందుల ఆరోపించారు. టీడీపీ హయాం లో మండలం లో అనేక పథకాలు, అభివృద్ధి ప నులు జరిగా యని కందుల గుర్తు చేశారు. ఈ మూ డున్న రేళ్లలో గ్రామాల్లో, మండలాల్లో అభివృద్ధి పనులు జరగతని విషయం, పథకాల పేరుతో మోసాలు, ధరలు, అవినీతి, అక్రమాలు, సమ స్యలపై ప్రజలకు చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైనా ఉందన్నారు. సమావేశం లో పార్టీ మండల అధ్యక్షుడు మీగడ ఓబుల రె డ్డి, పట్టణ అధ్యక్షుడు ముల్లా ఖుద్దూస్‌, జడ్పీ టీసీ మాజీ సభ్యుడు కాటూరి పెదబాబు, మా జీ సర్పంచ్‌ కాటూరి చినబాబు, శివాలయం మాజీ చైర్మన్‌ సామంతపూడి నాగేశ్వరరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఇమాంసా, మై నా రిటీ సెల్‌ నాయకులు షబ్బీర్‌, యర్రంరెడ్డి వెంక టేశ్వరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీను, నాయకులు ముని శ్రీను, ఎస్సీ సెల్‌ నాయ కులు ఠాగూర్‌ జ్యోతి మల్లికార్జున్‌, షేక్‌ కాలేషా, మస్తాన్‌వలి, రబ్బానీ, నరసింహారావు, పొదిలి సుబ్బయ్య, షేక్‌ మహమ్మద్‌ ఆలి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T21:57:44+05:30 IST

Read more