ప్రజాధనం దోచిపెట్టడానికే జగనన్న కాలనీలు

ABN , First Publish Date - 2022-11-16T23:11:48+05:30 IST

జగనన్న కాలనీల పేరుతో వైసీపీ నే తలకు ప్రజాధనాన్ని దోచిపెట్టడం తప్ప పేదలకు ఓరిగిందేమీ లేదని టీ డీపీ వై.పాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు బుధవారం ప్రకటనలో తెలిపారు.

ప్రజాధనం దోచిపెట్టడానికే జగనన్న కాలనీలు

మార్కాపురం, నవంబరు 16: జగనన్న కాలనీల పేరుతో వైసీపీ నే తలకు ప్రజా ధనాన్ని దోచిపెట్టడం తప్ప పేదలకు ఓరిగిందేమీ లేదని టీ డీపీ వై.పాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు బుధవారం ప్రకటనలో తెలిపారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవన స్థితిగతులు పూర్తిగా దిగజారిపో యాయన్నారు. పెరిగిన వస్తువుల ధరల నేపథ్యంలో రూ.1.80 లక్షలకు ఇంటిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మాట్లాడి భరోసా కల్పించే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై మంత్రి మేరుగ నాగార్జున అవేశంతో మాట్లాడటం తగదన్నారు.

Updated Date - 2022-11-16T23:11:48+05:30 IST

Read more