ప్రకాశంను మూడు ముక్కలు చేయడం దుర్మార్గం

ABN , First Publish Date - 2022-03-05T05:29:40+05:30 IST

జిల్లాల పునర్వి భజన పేరుతో ప్రకాశం జిల్లాను మూడు ముక్కలు చేయడం దుర్మార్గంగా ఉందని సీపీఐ రాష్ట్ర కా ర్యదర్శివర్గ సభ్యుడు పీజే.చంద్రశేఖరరావు విమ ర్శించారు. ఒంగోలులోని మల్లయ్యలింగంభవన్‌లో శుక్రవారం జరిగిన సీపీఐ కౌన్సిల్‌ సమావేశంలో ఆ యన మాట్లాడారు.

ప్రకాశంను మూడు ముక్కలు చేయడం దుర్మార్గం

మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలి 

 ప్రత్యేక హోదా కోసం 15న సదస్సు 

 సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చంద్రశేఖరరావు ఒంగోలు(కలెక్టరేట్‌), మార్చి 4 : జిల్లాల పునర్వి భజన పేరుతో ప్రకాశం జిల్లాను మూడు ముక్కలు చేయడం దుర్మార్గంగా ఉందని సీపీఐ రాష్ట్ర కా ర్యదర్శివర్గ సభ్యుడు పీజే.చంద్రశేఖరరావు విమ ర్శించారు. ఒంగోలులోని మల్లయ్యలింగంభవన్‌లో శుక్రవారం జరిగిన సీపీఐ కౌన్సిల్‌ సమావేశంలో ఆ యన మాట్లాడారు. రాష్ట్రంలో జిల్లాల విభజనను సీపీఐ పార్టీ స్వాగతిస్తున్నప్పటికీ జరిగిన తీరు మా త్రం బాగా లేదన్నారు. జిల్లాను మూడు ముక్కలు గా విభజించి జిల్లా వెనుకబాటు తనాన్ని మరింత పెంచుతుందని ఆయన ఆరోపించారు. మార్కాపు రం జిల్లాను కేంద్రంగా చేస్తూ కొత్త జిల్లాల  ఏ ర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అద్దంకి, కం దుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలోనే కొ నసాగించడంతో పాటు కందుకూరు డివిజన్‌ను కొ నసాగించాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వా లని డిమాండ్‌ చేస్తూ ఈనెల 15వ తేదీన స్థానిక కా పు కళ్యాణ మండపంలో సీపీఐ, సీపీఎం, మరావతి సాధన సమితి ఆధ్వర్యంలో జరిగే సదస్సును విజ యవంతం చేయాలని కోరారు. 25 మంది ఎంపీల ను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తామని హామీ ఇచ్చిన జగన్‌ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదన్నారు. విభజన అంశాలలో రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటిని సాధించుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అక్టోబరులో విజ యవాడలో జరిగే సీపీఐ జాతీయ మహాసభల్లోపు జిల్లాలోని అన్ని శాఖల మహాసభలను  నిర్వహిం చాలన్నారు. ఈనెల 6నుంచి మూడు రోజుల పాటు గుంటూరులో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభ లను విజయవంతం చేయాలని కోరారు. యుద్ధ స మయంలో ఉక్రెయిన్‌ నుంచి విద్యార్థులను తీసుకొని రావడంలో కేంద్ర ప్రభుత్వం విఫమైందని విమర్శిం చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌.నారాయణ పాల్గొన్నారు.


Read more