ఉపాధ్యాయురాలిది హత్యే?

ABN , First Publish Date - 2022-10-08T06:01:54+05:30 IST

కొత్తపట్నంలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు రా జ్యలక్ష్మి హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ నెల 5న ఒంగోలు నగరం దేవుడుచెరువులో తొట్టెంపూడి రాజ్యలక్ష్మి తన ఇంట్లో మృతి చెంది ఉన్నారు. పోలీసులు పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చే సి దర్యాప్తు ప్రారంభించారు.

ఉపాధ్యాయురాలిది హత్యే?

 సీసీఫుటేజీ ద్వారా గుర్తింపు 

పోలీసుల అదుపులో నిందితుడు 


ఒంగోలు(క్రైం), అక్టోబరు7: కొత్తపట్నంలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు రా జ్యలక్ష్మి హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ నెల 5న  ఒంగోలు నగరం దేవుడుచెరువులో  తొట్టెంపూడి రాజ్యలక్ష్మి తన ఇంట్లో మృతి చెంది ఉన్నారు. పోలీసులు పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చే సి దర్యాప్తు ప్రారంభించారు. అదేక్రమంలో శుక్రవారం  మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. మృతురాలి మెడ చుట్టూ స్వల్పగాయాలు ఉన్నాయి. అంతేగాకుండా ఆమె సెల్‌ఫోన్‌ కనిపించలేదు. స్విచాఫ్‌ చేసి ఉంది. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభిం చిన పోలీసులు సీసీఫుటేజీలో కీలకమైన ఆధారాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తి ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తున్నట్లు ఉంది. దీంతో సాంకేతిక పరిజ్ఞా నం ద్యారా ఇంట్లో నుంచి బయటకు వస్తున్న వ్యక్తిని గుర్తించిన పోలీసులు అదుపు లోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. అతడిని ఆ ఇంట్లో మరమ్మతు పను లకు  వచ్చిన వ్యక్తి కూడా గుర్తించారు. అయితే అతను ఇతర రాష్ట్రాలకు సంబం ధించిన వ్యక్తి కావడంతో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దీంతో అనుమానాస్పద కేసును హత్యకేసుగా మార్పు చేసి దర్యాప్తు వేగవంతం చేసే అవ కాశం ఉంది. ఈ నేపథ్యంలో డీఎస్పీ నాగరాజు శుక్రవారం సంఘటనా స్థలానికి వె ళ్లడంతో పాటుగా పోస్టుమార్టం జరిగే సమయంలో కూడా రిమ్స్‌ వద్దనే మకాం వే శారు. డాక్టర్లుతో మాట్లాడిన అనంతరం ఓ నిర్ధారణకు వచ్చారు. అయితే ఆమె హ త్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


Read more