ఇరిగేషన్‌ భూములు మాయం

ABN , First Publish Date - 2022-11-25T00:38:39+05:30 IST

డివిజన్‌ కేంద్రమైన మార్కాపురం పట్టణంలో దాదాపు లక్షకు పైగా జనాభా ఉంది. అన్ని సౌకర్యాలతో ప్రసిద్ధ పట్టణంగా పేరుగాంచింది.

ఇరిగేషన్‌ భూములు మాయం

పట్టించుకోని ఇరిగేషన్‌ అధికారులు

మార్కాపురం(వన్‌టౌన్‌), నవంబరు 24: డివిజన్‌ కేంద్రమైన మార్కాపురం పట్టణంలో దాదాపు లక్షకు పైగా జనాభా ఉంది. అన్ని సౌకర్యాలతో ప్రసిద్ధ పట్టణంగా పేరుగాంచింది. ఇటువంటి పట్టణంలో భూముల విలు వలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనిని ఆసరాగా చేసు కొని కొంత మంది రియల్‌ వ్యాపారులు, రాజకీయ నాయ కులు ప్రభుత్వ భూములను సొంతం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మార్కాపురం పట్టణంలోని నీటి పారుదల శాఖకు చెందిన భూములన్ని మాయమైపోయి అనేక కట్టడాలు వెలిశాయి. ముఖ్యంగా మార్కాపురం పట్టణంలోని సప్లై ఛానల్‌, వెంకటప్పయ్య తూము, రేడి యో స్టేషన్‌ సమీపంలోని చెరువు అలుగు, పారిశ్రామిక వాడ సమీపంలోని పెద్ద అలుగు, రైల్వే స్టేషన్‌ రోడ్డులోని నాయుడుపల్లె తూముపై నీటిపారుదల శాఖకు చెందిన భూములలో అక్రమ కట్టడాలు వెలిశాయి. ఇవేకాక పట్టణ శివార్లలోని నల్లవాగు కూడా యథేచ్ఛగా ఆక్రమణలకు గురై పిల్ల కాల్వలా మారింది. విశాలమైన నల్లవాగు రియల్‌స్టేట్‌ వ్యాపారులు ఆక్రమించి వెంచర్లు వేశారు. దర్జాగా సొంతంగా రివెట్మెంట్‌ గోడలు కట్టారు. ఇంత జరుగుతున్నా.., తమ భూములు కాపాడుకోవాల్సిన నీటి పారుదల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. దీంతో కోట్ల రూపాయల విలువైన భూములు ఆక్రమార్కుల పాలయ్యాయి. పట్టణంలోని వెంకటప్పయ్య తూము సున్నపుబట్టీల సమీపంలో ఉండేది. ఈ ప్రాంతం నుంచి కంభం రోడ్డు, జామియా మస్జీద్‌ స్థలం, జగదీశ్వరీ థియేటర్‌ రోడ్డు ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలకు నీరందించే పెద్ద కాలువ ఉండేది. ఒక వ్యక్తి సున్నపుబట్టీల సమీపంలో ఉన్న కాలువుపై ఆక్రమణ నిర్మాణం చేపట్టారు. దీంతో ఈ కాలువ మాయమైపోయింది. నారాయణ పాఠశాల, జామియా మస్జీద్‌కు చెందిన స్థలం ఎదురు, జగదీశ్వరీ థియేటర్‌ సమీపంలో పంటకాలువపై అక్రమంగా కట్టడాలు కట్టి రూములు నిర్మించి అద్దెలకు ఇస్తున్నారు. సప్లై ఛానల్‌పై కూడా కట్టను ఆక్రమించి ఇళ్లను నిర్మించుకున్నారు. వివిధ అవసరాలకు వినియోగి స్తున్నారు. ఇకపోతే రేడియో స్టేషన్‌ సమీపంలోని చిన్న అలుగుపై 1977లో ఎటువంటి నిర్మాణాలు ఉండేవీ కావు. కానీ ఇటీవల కాలంలో అలుగు నుంచి చిన్నమస్జీద్‌ వరకు పూర్తి స్థాయిలో కట్టడాలు వెలిశాయి. పారిశ్రామికవాడ ప్రాంతం నుంచి పెద్ద అలుగుపై కూడా ఆక్రమించి ఇళ్లను నిర్మించారు. డ్రైవర్స్‌ కాలనీ సమీపంలోని నాయుడుపల్లె తూముకు చెరువుకు మద్య ఉండే స్థలాన్ని కూడా ఆక్రమించారు. పట్టణ శివార్లలోని నరసింహస్వామి కొండ వద్ద నల్లవాగు పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురై పిల్ల కాల్వలా మారింది. ఎంతో పెద్దగా ఉండే వాగును రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమించి వెంచర్లు వేశారు. వైసీపీకి చెందిన ఒక ముఖ్యనాయకుడి అనుచరులు తన వెంచర్‌ కోసం నల్లవాగును అధికమొత్తంలో పూడ్చివేసి కట్టుకున్నాడు. ఇంత జరుగుతున్నా నీటి పారుదల శాఖ అధికారులు తమ భూములను, రూ.కోట్ల విలువైన స్థలాలను కాపాడుకోవడంలో విఫలమవుతున్నారు. ఇప్పటికైనా కోట్ల విలువైన ఇరిగేషన్‌ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

Updated Date - 2022-11-25T00:38:39+05:30 IST

Read more