-
-
Home » Andhra Pradesh » Prakasam » Irregularities in ecrop booking will result in suspension-NGTS-AndhraPradesh
-
ఈ-క్రాప్ బుకింగ్‌లో అక్రమాలు జరిగితే సస్పెండే
ABN , First Publish Date - 2022-08-31T06:22:23+05:30 IST
ఈ-క్రాప్ బుకింగ్‌లో అవకతవకలు జరిగితే సంబంధిత అ ధికారులను సస్పెండ్ చేస్తానని కలెక్టర్ దినేష్‌కు మార్ హెచ్చరించారు. మంగళవారం స్థానిక కలె క్టరేట్ నుంచి ఆర్డీవోలు, మండల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మా ట్లాడారు.

కలెక్టర్ దినేష్‌కుమార్ హెచ్చరిక
ఒంగోలు(కలెక్టరేట్), ఆగస్టు 30 : ఈ-క్రాప్ బుకింగ్‌లో అవకతవకలు జరిగితే సంబంధిత అ ధికారులను సస్పెండ్ చేస్తానని కలెక్టర్ దినేష్‌కు మార్ హెచ్చరించారు. మంగళవారం స్థానిక కలె క్టరేట్ నుంచి ఆర్డీవోలు, మండల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మా ట్లాడారు. పంట నష్టపరిహారం అందించేందుకు ఈ-క్రాప్ నమోదే కీలకమన్నారు. వీఆర్వోలు, స ర్వేయర్లు, అగ్రికల్చరల్ అసిస్టెంట్లు సమన్వయం చేసుకొని పారదర్శకంగా పనిచేయాలని ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో అక్రమాలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ల్యాండ్ ఆడిట్‌ను పక డ్బందీగా నిర్వహించాలని, అభ్యంతరకర పొరం బోకు భూములను ఆన్‌లైన్ చేయకూడదని చె ప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను త్వర గా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భూరీ సర్వేలో వీఆర్వోలు, సర్వేయర్లు మరిత చురుకు గా వ్యవహరించాలన్నారు. సర్వే పూర్తయిన చోట సరిహద్దు రాళ్లను కూడా త్వరగా పాతాలని తెలి పారు. 22(ఎ) జాబితా నుంచి భూములను తొ లగించే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల ని, ఈ వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రా నికి పంపాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమం లో జేసీ అభిషిక్త్‌కిషోర్, డీఆర్వో సరళావందనం తదితరులు పాల్గొన్నారు.