యాసిడ్‌ పోసి హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవం

ABN , First Publish Date - 2022-11-24T22:58:48+05:30 IST

తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిపై యాసిడ్‌ పోసి హత్య చేసిన వల్లెపు లక్ష్మయ్యకు యావజ్జీవ కారగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ ఒంగోలు రెండో అదనపు సెషన్స్‌ జడ్జి ఎంఏ.సోమశేఖర్‌ గురువారం తీర్పునిచ్చారు.

యాసిడ్‌ పోసి హత్య చేసిన కేసులో   నిందితుడికి యావజ్జీవం

రూ.లక్ష జరిమాన విధించిన కోర్టు

ఒంగోలు(క్రైం), నవంబరు 24 : తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిపై యాసిడ్‌ పోసి హత్య చేసిన వల్లెపు లక్ష్మయ్యకు యావజ్జీవ కారగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ ఒంగోలు రెండో అదనపు సెషన్స్‌ జడ్జి ఎంఏ.సోమశేఖర్‌ గురువారం తీర్పునిచ్చారు. వివరాలలోకి వెళితే.. సంతమాగులూరు మం డలం ఏల్చూరు గ్రామానికి చెందిన కె.శ్రీను ఇంట్లో భోజనం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన వల్లెపు లక్ష్మయ్య యాసిడ్‌ పోశాడు. ఈ ఘటన 2019 ఏప్రిల్‌ 12న జరిగింది. తన భార్యతో శ్రీను వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో లక్ష్యయ్య ఈ దారుణానికి పాల్పడ్డాడు. యాసిడ్‌ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనును గుంటూ రు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు సంతమాగులూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న సీఐ హైమారావు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. సాక్షులను విచారించిన న్యాయమూర్తి లక్ష్మయ్యపై నేరం రుజువు కావడంతో యావజ్జీవ కారగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమాన విధించారు. జరిమాన విధించిన రూ.లక్షలను మృ తుడు శ్రీను భార్యకు ఇవ్వాలని తీర్పులో జడ్జి పేర్కొన్నారు. బాధితుల తరఫున అదనపు పీపీ వై.కొండారెడ్డి వాదనలు వినిపించారు.

Updated Date - 2022-11-24T22:58:48+05:30 IST

Read more