జగన్‌ పాలనలో జనాలకు అన్నీ కష్టాలే

ABN , First Publish Date - 2022-09-28T04:31:18+05:30 IST

జగన్‌ పాలనలో జనాలకు అన్నీ కష్టాలే దాపురించాయని టీడీపీ మండ లాధ్యక్షుడు నంబుల వెంకటేశ్వర్లు యాదవ్‌, నాయకులు భేరి పు ల్లారెడ్డి అన్నారు.

జగన్‌ పాలనలో జనాలకు అన్నీ కష్టాలే
కరపత్రాలను పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులు

కనిగిరి, సెప్టెంబరు 27: జగన్‌ పాలనలో జనాలకు అన్నీ కష్టాలే దాపురించాయని టీడీపీ మండ లాధ్యక్షుడు నంబుల వెంకటేశ్వర్లు యాదవ్‌, నాయకులు భేరి పు ల్లారెడ్డి అన్నారు. మండలంలోని లింగారెడ్డి పల్లి పంచాయతీలోని కొ త్తపల్లి గ్రామంలో మంగళ వారం  బాదుడే బాదుడు కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా వారు గ్రామంలో పర్య టిస్తూ ప్రజలపై వైసీపీ అమలు చేస్తున్న ధరల బా దుడు  చేప ట్టిన అదిక ధరల బా దుడు పధకాన్ని ప్రజలకు వివ రించారు. పెరిగిన నిత్యావసర దరలతో అల్లాడి పోతున్నామని కొత్తపల్లి గ్రామంలోని పేద కు టుంబాలకు చెందిన ప్రజలు టీడీపీ నేతల ఎదుట వా పోయారు. ఖాతాల్లో డబ్బులేస్తున్న జగన్‌రెడ్డి ధరలను పెంచి అల్లాడిస్తున్నాడని వాపోయారు. ఇచ్చేది ఇసు మంత తిరిగి అధిక ధరలతో వసూలు చేసిది తాటి కాయంత అంటూ ఓ వృద్ధురాలు   నేతల ఎదుట ఎద్దేవా చేసింది. ప్రజల సంక్షేమం టీడీపీ సాధ్యమనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని టీడీపీ నేతలు కోరారు. మళ్లీ చంద్రబాబు అధి కారంలోకి వస్తేనే ప్రజలు అన్ని విధాలుగా సంక్షేమంతో ఉంటారన్నారు. టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డిని గెలిపిస్తే కనిగిరి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, డాక్టర్‌ ఉగ్ర చేపట్టబోయే అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముచ్చుమూరి చెంచిరెడ్డి, నాగార్జున, నాగేంద్ర, వెంక టేశ్వరరెడ్డి, వీర్ల కిషోర్‌, నరసింహ, గోపి, బ్రహ్మయ్య, కొండయ్య, శివ కోటయ్య, అమ్మిరెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 


Read more