-
-
Home » Andhra Pradesh » Prakasam » If you block the padayatra people will be wise-MRGS-AndhraPradesh
-
పాదయాత్రను అడ్డుకుంటే ప్రజలు బుద్ధి చెబుతారు!
ABN , First Publish Date - 2022-09-12T04:59:30+05:30 IST
అమరావతి నుంచి అరసవల్లి వరకు అమరావతి రైతు లు చేపట్టిన పాదయాత్రను వైసీపీ కార్యకర్త లు అడ్డుకోవాలని చూస్తే ప్రజలు బుద్ధి చెబుతార ని దళిత సోషన్ ముక్తిమంచ్ (డీఎస్‌ఎంఎం) జా తీయ కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు.

డీఎస్‌ఎంఎం జాతీయ కార్యదర్శి శ్రీనివాసరావు
చీరాలటౌన్, సెప్టెంబరు 11: అమరావతి నుంచి అరసవల్లి వరకు అమరావతి రైతు లు చేపట్టిన పాదయాత్రను వైసీపీ కార్యకర్త లు అడ్డుకోవాలని చూస్తే ప్రజలు బుద్ధి చెబుతార ని దళిత సోషన్ ముక్తిమంచ్ (డీఎస్‌ఎంఎం) జా తీయ కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. గత మూడు రోజులుగా చీరాల బాపనమ్మ కల్యాణ మండపంలో జరుగు తున్న కేవీపీఎస్ రాష్ట్ర శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిశాయి. శ్రీనివాసరా వు మాట్లాడుతూ రైతుల పాదయాత్రకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. అమరావ తిపై భిన్నాభిప్రాయాలు ఉంటే పరిశీలన చేయాలి గానీ కుట్రలు పూనడం సరికాదన్నారు. పాదయా త్ర రైతులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభు త్వానిదేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుల వ్యవస్థను నిర్మూలించకుండా అంటరానిత నం నిర్మూలిస్తామని మాటలు చెప్పడం హాస్యాస్ప దమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కులాంతర వివాహాలకు ఆర్థికంగా అందించే ప్రోత్సాహకాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేవీ పీఎస్ రాష్ట్ర అఽధ్యక్ష కార్యదర్శులు ఆండ్ర మాల్యా ద్రి, నల్లప్ప, ఉపాధ్యక్షుడు జి.నటరాజ్, సహాయ కార్యదర్శులు క్రాంతిబాబు, రఘురాం, ఆనంద్‌బా బు, బాపట్ల జిల్లా కన్వీనర్ కృష్ణమోహన్, కోకన్వీ నర్ లింగం జయరాజు, ఎన్.బాబురావు, కుర్రా రామారావు, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.