పట్టుకోండి చూద్దాం...!

ABN , First Publish Date - 2022-12-06T23:21:15+05:30 IST

ఒంగోలు నగరంలో దొంగలు హల్‌చల్‌ చేస్తున్నారు. వరుస చోరీలను ప్రజలు భయపడుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్ళి వచ్చే సరికి దుండుగులు విలువైన వస్తువులు ఊడ్చివేస్తున్నారు. నగరంలోని నడిబొడ్డున ఉన్న ాంధీ రోడ్డులో వేమూరిహర్ష జ్యువెల్సరీలో ఆదివారం పట్టపగలు కన్నం వేసి చోరీకి పాల్పడటం పోలీసులు సైతం నివ్వెరపోయారు. పట్టుకోండి చూద్దామంటూ దొంగలు పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు.

 పట్టుకోండి చూద్దాం...!

నగరంలో దొంగలు హల్‌చల్‌

వారంలో మూడు చోరీలు

పోలీసులకు సవాల్‌ విసురుతున్న దుండగులు

పట్టించుకోని సీసీఎస్‌ సిబ్బంది

ఒంగోలు(క్రైం), డిసెంబరు 6: ఒంగోలు నగరంలో దొంగలు హల్‌చల్‌ చేస్తున్నారు. వరుస చోరీలను ప్రజలు భయపడుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్ళి వచ్చే సరికి దుండుగులు విలువైన వస్తువులు ఊడ్చివేస్తున్నారు. నగరంలోని నడిబొడ్డున ఉన్న ాంధీ రోడ్డులో వేమూరిహర్ష జ్యువెల్సరీలో ఆదివారం పట్టపగలు కన్నం వేసి చోరీకి పాల్పడటం పోలీసులు సైతం నివ్వెరపోయారు. పట్టుకోండి చూద్దామంటూ దొంగలు పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. ఇలాంటి నేరాలు జరగకుండా అరికట్టాల్సిన సీసీఎస్‌ పోలీసులు సేద తీర్చుకుంటున్నారు. నేరస్థులను గుర్తించడం విస్మరించి అంతర్గత కుమ్ములాటలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. మిగిలిన పోలీ్‌సస్టేషన్‌లలోని పోలీసులు కేవలం శాంతిభద్రతలు, ప్రజాప్రతినిధిలకు ప్రోటోకాల్‌ విధులలో నిమగ్నమైపోయారు. దీంతో దొంగలు చెలరేగిపోతున్నారు. గతంలో దొంగతనాలు జరిగితే నగరం అంతా అప్రమత్తం అయ్యే పోలీసులు ప్రస్తుతం సీసీ కెమెరాలు, టవర్‌ డంప్‌లు అంటూ సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడుతున్నారు. వారం రోజులలో వరసగా చోరీలు జరిగితే దొంగలు కచ్చితంగా నగరంలో ఎక్కడో ఒకచోట బస చేసే అవకాశం లేకపోలేదు. లేకుంటే ఏదో ఒక లాడ్జిలో ఉండి ఉండవచ్చు. ప్రస్తుతం లాడ్జిలపై అసలు పోలీసులు దృష్టి సారించడం లేదు. నగరం శివారు ప్రాంతాలలో సైతం రాత్రులు గస్తీని గాలికి వదిలి కేవలం రాజకీయనాయకుల ప్రాపకం కోసం తిరగడం పోలీసుల విధుల్లో భాగమైంది.

వారంలో మూడు చోరీలు

నగరంలో వారం రోజుల్లో మూడు దొంగతనాలు జరిగాయి. తొలుత రాజీవ్‌ నగర్‌ ఎక్స్‌టెన్స్‌లో ఇంటికి తాళం వేసి పెళ్లికి వె ళ్ళి తిరిగి వచ్చేసరికి దొంగలు చోరీ కి పాల్పడ్డారు. అదేవిధంగా భాగ్యనగర్‌ మూడో లైన్‌లో ఓ ఇంట్లో దొంగలు సుమారు రూ. 3లక్షలు సొత్తు అపహరించా రు. గత ఆదివారం నగర డిప్యూటీ మేయర్‌ బంగారం దుకాణంలో దొంగతనం జరగడంతో పోలీసు లు అప్రమత్తమై హడావుడి సృష్టించా రు. అయినప్పటికీ ఎలాంటి ఆధారాలు సేకరిచలేకపోయారు. అంతేగాకుండా వరసగా జరిగిన మూడు దొంగతనాలు ఒకే విధంగా జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నగరంలో జరిగే చోరీలతో పోలీసులలో చలనం లేకపోవడంతో దొంగలు మరిం త రెచ్చిపోయారు. ఏకంగా నగర డిప్యూటీ మేయర్‌ బంగారు దుకాణానికే కన్నం వేశారు. నగరంలో రాత్రి పూట పోలీసులు గస్తీ అతంత మాత్రంగా ఉంది. రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ బస్టాండ్‌లతోపాటు ముఖ్యమైన కూడళ్లలోగస్తీ ఉండకపోవడంతో దుండగులకు బాగా కలిసి వస్తోంది.

దొంగతనాల అరికట్టేందుకు చర్యలు : డీఎస్పీ

ఇటీవల జరిగిన చోరీ కేసుల్లో దొంగలను పట్టుకోవడాకి అనేక బృందాలు పనిచేస్తున్నాయని ఒంగోలు డీఎస్పీ నాగరాజు తెలిపారు. నగరంలో గస్తీని ముమ్మరం చేస్తామని, ముఖ్యమైన ప్రాంతాల్ల నిఘా పెంచుతామని చెప్పారు. అదేవిధంగా ఇంటికి తాళం వేసి వెళ్లేవారు ఎల్‌హెచ్‌ఎంఎ్‌సను వినియోగించుకోవాలని సూచించారు. కొత్త వ్యక్తుల సంచారం ఉంటే పోలీసులకు సమాచార ఇవ్వాలని ఆయన కోరారు.

Updated Date - 2022-12-06T23:21:17+05:30 IST