సస్యరక్షణ చర్యలతో అధిగ దిగుబడులు

ABN , First Publish Date - 2022-09-25T03:59:35+05:30 IST

పంటల సస్యర క్షణను చేపట్టి అత్యధిక దిగుబడులు సాధించా లని వ్యవసాయ వనరుల కేంద్రం డిప్యూటీ ప్రా జెక్టు డైరెక్టర్‌ అన్నపూర్ణమ్మ అన్నారు.

సస్యరక్షణ చర్యలతో అధిగ దిగుబడులు
చినిర్లపాడులో కంది పంటను పరిశీలిస్తున్న అన్నపూర్ణ

వ్యవసాయ వనరుల కేంద్రం డిప్యూటీ పీడీ అన్నపూర్ణమ్మ

కనిగిరి, సెప్టెంబరు 24 : పంటల సస్యర క్షణను చేపట్టి అత్యధిక దిగుబడులు సాధించా లని వ్యవసాయ వనరుల కేంద్రం డిప్యూటీ ప్రా జెక్టు డైరెక్టర్‌ అన్నపూర్ణమ్మ అన్నారు. మండ లంలోని చినిర్లపాడు, ఏరువారిపల్లి గ్రామాల్లోని కంది, పత్తి పంటలను పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయా పం టలు సాగు చేసిన రైతులకు అదిక దిగుబడులు సాధించేందుకు తీసుకో వాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఏరువారిపల్లి గ్రామంలోని పత్తి పంటలకు రసం పీల్చే పు రుగు ఆశించడాన్ని గుర్తించారు. వాటి నివార ణకు పసుపు రంగు జిగురు అట్టలు 10 చొ ప్పున ఎకరాకు పెట్టుకుంటే తెల్లదోమ ఉధృతిని తగ్గిం చుకోవచ్చునన్నారు.  నీలిరంగు జిగురు అట్టను ఎకరాకు 10 చొప్పున ఏర్పాటు చేస్తే తా మర పురుగును తగ్గించు కోవచ్చని తెలిపారు. ఇంకా రసం పీల్చే పురుగు అధికంగా ఉన్నట్ల యితే ఎసిటిమాఫ్రైడ్‌ మందును పిచికారీ చే యాలని అన్నపూర్ణమ్మ సూచించారు. గులాబీ రంగు పురుగును తెలుసుకునేందుకు ఎక రానికి 10 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాల న్నారు. దాం తో పాటు సింథటిక్‌ ఫైరిథ్రాయిడ్స్‌ మందును 100 రోజుల వయ సు దాటిన పైరు కు మాత్రమే పిచికారీ చేయాలన్నారు. ముం ద స్తుగా  సింథటిక్‌ ఫైరిథ్రాయిడ్స్‌ను వాడిన ట్ల యితే తెల్లదోమ నివారణ కష్టమవుతుందని తెలిపారు. చినిర్లపాడులో కంది పం టలను పరిశీ లించిన ఆమె పంటలో అక్కడక్కడా ఎర్రితెగులు లక్షణాలు ఉన్న మొక్కలను గుర్తించారు. దాని నివారణకు 3 గ్రా ముల నీటిలో కరిగే గంధకాన్ని పిచికారీ చేయాలని, ముం దస్తుగా వేప నూనె  1500 పీపీఎం గాఢతకల్గిన వేప నూనెను 3.5 ఎంఎల్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. ఎర్రితెగులు ఆశించకుండా 0 మైట్‌ 2 ఎంఎల్‌ లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. పత్తి పంటలో 6నెలలకు మించి కాల పరిమితి పొడిగించవద్దని, తీసివేయాలని సూచించారు. 3 నెలల లోపు కంది పంటకు పురుగు ఆశించకుండా క్వినాబ్యాస్‌ 2 ఎంఎల్‌ లేదా క్లోరిపైరిపాస్‌ 2.5 ఎంఎల్‌ కానీ, ప్రొఫెనోఫాస్‌ 2ఎంఎల్‌, ఇండిక్సకార్ప్‌ 1 ఎంఎల్‌ థయోడికార్ప్‌ 1.5 గ్రాముల నీ టిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏ డీఏ ఈవీ రమణ, ఏఓలు పి.జోత్ష్నాదేవి పాల్గొన్నారు. పట్టణం లోని గార్లపేట రోడ్డులోని వెటర్నరీ భవనంలో ఆర్బీ కే, వ్యవ సాయ, సచివాలయ సిబ్బందితో అన్నపూర్ణమ్మ సమీక్షించారు. 

పీసీపల్లిలో..

పీసీపల్లి :  కందిపైరులో సస్యరక్షణ చర్యల ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చునని జిల్లా వనరుల కేంద్రం శిక్షణ వ్యవసాయ అధికారి శేషమ్మ అన్నారు. మండలంలోని గుదే వారిపాలెం, పెదఅలవలపాడు, నేరేడుపల్లి గ్రామాల్లో శనివారం రైతులతో కలిసి కంది, పత్తి, వరి పైర్లను అన్నపూర్ణమ్మ పరి శీలించారు. ముఖ్యంగా కందిపైరులో ఎస్‌ఎమ్‌డీ వైరస్‌తో పాటు మారుక మచ్చల పురుగు గుడ్లు ఉండడాన్ని ఆమె గమనించారు. అనంతరం ఆమె రైతులతో మాట్లాడుతూ పైరు మొలకెత్తిన నాటి నుంచి 30 నుంచి 40 రోజుల దశలో 15 రోజులకోసారి వేపనూనెను పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి జి.వెంకటస్వామి, గ్రామ వ్యవసాయ సహాయకులు కిషోర్‌, శ్రావణి, అఖిల్‌, రైతులు పాల్గొన్నారు. 

వెలిగండ్లలో..

వెలిగండ్ల : సస్యరక్షణ చర్యలను పాటిస్తూ కంది సాగులో అధిక దిగుబడులు సాధించ వ చ్చునని జిల్లా వనరుల కేంద్రం ఏవో శైలజ రాణి తెలిపారు శనివారం మండలంలోని మొ గళ్లూరు, గోకులం పంచాయల్లోని రైతులతో కలిసి కంది, సజ్జ పంట పొలాలను పరిశీలిం చారు అనంతరం రైతు భరోసా కేంద్రంలో రైతు లతో సమావేశం నిర్వహించారు 30-40 రోజుల పంట కాలంలో వ్వవసాయ అధికారులు సూ చించిన మందులను పిచకారీ చేయడం ద్వారా రసం పీల్చు పురుగులను నివారించవచ్చని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఏవో రంగా కృష్ట, రైతులు పాల్గొన్నారు.Read more