చెన్నకేశవస్వామి ఆలయంలో హైకోర్టు జడ్జి పూజలు

ABN , First Publish Date - 2022-10-04T06:41:40+05:30 IST

మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆల యంలో సోమవారం హైకోర్టు న్యాయమూర్తి శివశంకర్‌ ప్రత్యేక పూజలు చేశారు.

చెన్నకేశవస్వామి ఆలయంలో హైకోర్టు జడ్జి పూజలు
పూజలు చేస్తున్న హైకోర్టు జడ్జి శివశంకర్‌

మార్కాపురం(వన్‌టౌన్‌), అక్టోబరు 3 : మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆల యంలో సోమవారం హైకోర్టు న్యాయమూర్తి శివశంకర్‌ ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు ఆధ్వర్యంలో ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం చెన్నకేశవస్వామి, రాజ్యలక్ష్మి అమ్మవార్లను జడ్జి దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ విశిష్ఠతను వివరిం చారు. ఈ సందర్భంగా జడ్జి శివశంకర్‌ మాట్లాడుతూ.., భారతీయ సనాతన ధర్మం గొప్పదన్నారు. ప్రపంచశాంతికి పాటుపడిందన్నారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ పి.కేశవరావు, ఈవో జి.శ్రీనివాసులరెడ్డి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు.


Read more