జోరు వానలు..!

ABN , First Publish Date - 2022-10-02T03:53:50+05:30 IST

దర్శి ప్రాంతంలో శనివారం వర్షం ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. ఈ వర్షం వలన మెట్ట ప్రాంత రైతులకు మేలు చేకూరగా మాగాణి ప్రాంత రైతులకు నష్టం చేకూరింది.

జోరు వానలు..!
సజ్జ కంకులు తడవకుండా పరదా కప్పుతున్న రైతులు

దర్శి, అక్టోబరు 1 : దర్శి ప్రాంతంలో శనివారం వర్షం ఎడతెరపి లేకుండా  వర్షం కురిసింది. ఈ వర్షం వలన మెట్ట ప్రాంత రైతులకు మేలు చేకూరగా మాగాణి ప్రాంత రైతులకు నష్టం చేకూరింది. సాగర్‌ ఆయకట్టు కింద భూముల్లో ఖరీప్‌ సీజన్‌లో సాగుచేసిన సజ్జపైరు కోతకు వచ్చింది. కొంతమంది కంకులు కోసి కళ్లాలు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో అకాల వర్షం కురవడంతో సజ్జ కంకులను కాపాడుకునేందుకు రైతులు నాతా తంటా పడుతున్నారు. కొత్తపల్లి, త్రిపురసుంద రీపురం, కోర్లమడుగు, సామంతపూడి, జముకులదిన్నె తదితర ప్రాంతాల్లో సాగు చేసిన సజ్జ కోతకు వచ్చింది. త్రిపు రసుందరీపురంలో  పెద్ద ఎత్తున సజ్జ కంకుల రాసులు పొలా ల్లో ఉన్నాయి. భారీ వర్షం కురవడంతో రైతులు  పరదాలు అద్దెకు తీసుకొని కంకులపై కప్పి  కాపాడుకునే పనిలోపడ్డారు.  ఇంకా పొలాల్లొ కోతకు వచ్చిన సజ్జ పంట అలాగే ఉంది. భారీ వర్షానికి పొలాల్లో నీరుకూడా చేరింది. ఈ వర్షం ఇంకా అధికమైతే సజ్జ కంకులు మొలకెత్తి పంట పూర్తిగా నష్టపోతుందని రైతులు అందోళన చెందుతున్నారు.  మెట్ట ప్రాంతాల్లో సాగుచేసిన కంది, ఆముదం, పత్తి, మిర్చి తదితర పైర్లకు ఈ వర్షం జీవం పోస్తుందన్నారు. గత కొన్ని రోజులుగా మెట్ట పైర్లు వర్షం లేక వాడుముఖం పట్టిన విషయం తెలిసింది. ఈ వర్షం వలన మెట్ట పైర్లు పుంజుకునే అవకాశం కలగడంతో ఆ ప్రాతం రైతులకు ఊర ట లభించింది. 

పొంగిన ఈదర వాగు

ముండ్లమూరు : మండలంలో శుక్ర, శనివారం కురిసిన భారీ వ ర్షానికి పలు గ్రామాల్లోని వీధులు జలమయమయ్యాయి. మారెళ్ల సమీపంలోని ఈదర వాగు పై నేల చప్టాపై నీరు ప్రవహిస్తుంది.  మారెళ్ల నుంచి జమ్మలమడక, మక్కెనవారిపాలెం, కొండలరాయునిపాలెం వెళ్లే వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం వరకు వాహన చోదకులు వెళ్లకుండా ఇ బ్బంది పెట్టింది. సాయం త్రం కూడా మండ లంలోని అన్ని గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. మండల కేంద్రం ముండ్లమూరులోని పోలీసు స్టేషన్‌ ఎదుట అద్దంకి - దర్శి ప్రధాన రహదారి నీరు జలమయమైంది. నీరు ఎక్కువగా ఉండటంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

కూలిన రేకుల షెడ్డు

ముండ్లమూరు గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన జమ్ముల గురవయ్యకు చెందిన రేకుల షెడ్డు శనివారం కూలి పోయింది. గురువారం కురిసిన వర్షానికి నాని ఒక్కసారిగా  పడిపోయింది. రూ.1.50 లక్షలు నష్టం వాటిల్లిందని బాధితుడు లబోదిబోమంటున్నాడు.

కంది, పత్తికి జీవం

కనిగిరి :  శనివారం కురిసిన వర్షాలు మెట్ట పేర్లకు ఎంతో మేలు చేస్తాయని వ్యవసాయశాఖ ఏడీఏ ఈవీ రమణ తెలి పారు. నియోజకవర్గంలోని కనిగిరి, పామూరు, పీసీపల్లి మం డలాల్లో పలు గ్రామాల్లో పత్తి, కంది పైర్లు సాగులో ఉన్నట్లు చెప్పారు. ఈ వర్షంతో కంది చేలకు మంచి దిగుబడి వచ్చే అవకాశముందన్నారు.  సజ్జ కోత దశకు వచ్చిందని రైతులు వర్షాలు తగ్గిన తర్వాత  కోత కోసుకోవాలని సూచించారు. ఇప్పటికే కోసి ఉన్న సజ్జకు నష్టం జరుగుకుండా పట్టలు కప్పుకోవాలన్నారు.  పత్తి కాయ పిందె దశలో ఉందని వర్షం వల్ల పత్తి చేనుకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. వర్షాలు తగ్గు ముఖం పట్టాక చీడ పురుగులు ఆశించకుండా రైతులకు తగు సూచనలు చేస్తామని చెప్పారు. 

వర్షంతో డిగ్రీ పరీక్ష వాయిదా

కనిగిరి : అనుకోని వర్షం కారణంగా డిగ్రీ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్‌ పరిక్షలు వాయిదా వేస్తూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శనివారం జరగాల్సిన పరీక్షలు వా యిదా పడ్డాయి. శనివారం తొలి పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సి ఉండగా, గంట ముందు నుంచి కనిగిరిలో కుండపోతగా 15 నిమిషాలు పడింది. శనివారం ఉదయం నుంచి కూడా ఎడతెరపి లేకుండా వాన కురుస్తుండడంతో మ రింత పెరిగే సూచన ఉండడంతో పరీక్ష హాలుకు గంట ముందే విద్యార్థులు చేరుకున్నారు. అయితా పరీక్ష వాయిదా వేసినట్లు సమాచారం రావడంతో అందరూ వానలో తడుస్తూ ఇళ్లకు చేరారు. కొందరు బస్సుల కోసం ఎదురుచూస్తూ వానలోనే నిరీక్షిం చాల్సిన పరిస్థితి వచ్చింది.  నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడినట్లు డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం తెలిపింది.  డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ సెకెండ్‌ సెమిస్టర్‌ ఇంగ్లీష్‌ పరీక్ష వాయిదా పడింది.  6వ తేదీ నుంచి జరగాల్సిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని  ప్రిన్సిపాల్‌ తెలిపారు.
Read more