వ్యాయామంతోనే ఆరోగ్యం

ABN , First Publish Date - 2022-09-18T03:38:41+05:30 IST

వ్యాయామంతో ఎంతో ఆరోగ్యంగా ఉం డవచ్చని మున్సిపల్‌ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు అన్నారు.

వ్యాయామంతోనే ఆరోగ్యం
స్వచ్ఛత ర్యాలీలో పాల్గొన్న చైర్మన్‌, కమిషనర్‌

కనిగిరి, సెప్టెంబరు 17: వ్యాయామంతో ఎంతో ఆరోగ్యంగా ఉం డవచ్చని మున్సిపల్‌ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు అన్నారు. పీవీఆర్‌ మున్సిపల్‌ పార్కులో శనివారం నూతనంగా ఏర్పాటు చేసిన వ్యా యామ పరికరాలను కమిషనర్‌ ప్రారంభించారు.  ప్రస్తుతం మనిషి యాంత్రీకరణ జీవనానికి అలవాడుపడ్డారన్నారు. దీంతో ఎంతో మానసిక ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు.  ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ప్రజ లందరికీ అనుకూలంగా ఈ పార్కులో వ్యాయామాలు చేసుకునేలా జిమ్‌ పరికరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  

ప్లాస్టిక్‌ను వదిలేయండి

కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ వాడకాన్ని ఒదిలే యాలని మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌, కమిషనర్‌ నారాయణ రావు ప్రజలను కోరారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా ప ట్టణంలో ఇండియన్‌ స్వఛ్ఛతా లీగ్‌ ర్యాలీని నిర్వహించారు. బహిరంగ ప్ర దేశాల్లో వ్యర్థాలు వేయొద్దన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఎవరి కివారు తమవంతు బాధ్యతను నిర్వర్తించాలన్నారు.  కార్యక్రమంలో ఇన్‌ చార్జి శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ చెన్నకేశవులు, ప్రిన్సిపాల్‌ అరుణోదర్‌, గుడ్‌ హెల్ప్‌ రమేష్‌బాబు, శానిటరీ సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు. 


Read more