రూ.3.50లక్షల విలువైన గుట్కా పట్టివేత

ABN , First Publish Date - 2022-07-07T05:56:58+05:30 IST

భారీ స్థాయిలో గుట్కా ప్యాకెట్లు అక్రమంగా రవాణా చేస్తున్న ఇరువురుని అరెస్టు చేసి కారును బుధవారం ఒంగోలు టాస్క్‌పోర్స్‌, ఎస్‌ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రూ.3.50లక్షల విలువైన గుట్కా పట్టివేత

ఇరువురు అరెస్టు.. కారు స్వాధీనం


ఒంగోలు(క్రైం), జూలై 6 : భారీ స్థాయిలో గుట్కా ప్యాకెట్లు అక్రమంగా రవాణా చేస్తున్న ఇరువురుని అరెస్టు చేసి కారును బుధవారం ఒంగోలు టాస్క్‌పోర్స్‌, ఎస్‌ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక బృందావన నగర్‌లో జీఎస్‌నారాయణకు చెందిన ఇంట్లో అ క్రమంగా నిల్వ ఉంచిన 2,39,556 గుట్కా ప్యాకె ట్లను స్వాధీనం చేసుకొని అతడిని అరెస్టు చేశా రు. వాటి మొత్తం విలువ సుమారు రూ.3.43 లక్షలు ఉంటుదని ఎస్‌ఈబీ జేడీ సూర్యచంద్ర రావు తెలిపారు. అలాగే స్థానిక కొత్త కూరగా యల మార్కెట్‌లో అనుమానాస్ప దంగా ఉన్న కారు (ఏపీ39ఈసీ 8055)లో 27,375 గుట్కా ప్యాకెట్లను గుర్తించి సీజ్‌ చేశారు. అదేవిధంగా అక్కడ ఒంగోలుకు చెందిన ముల్లూరి వెంకట నాగశివచరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్‌ఈబీ స్టేషన్‌లో జరిగిన మీడియా సమావేశంలో జేడీ మాట్లాడుతూ గు ట్కా, గంజాయి, నాటుసారాయి అక్రమంగా ని ల్వ ఉంచినా, తరలించినా డయల్‌-100కు సమా చారం ఇవ్వాలని కోరారు. సమావేశంలో ఈఎస్‌ ఆవులయ్య, ఏఈఎస్‌ సుధీర్‌బాబు, ఎస్సై శ్రీని వాసరావు, హెడ్‌కానిస్టేబుల్‌ సామ్యూల్‌, వి.గో పాల్‌రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-07T05:56:58+05:30 IST