పట్టభద్రులు ఓట్లు నమోదు చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-10-04T05:26:06+05:30 IST

ఈనెల 1వ తేదీ నుంచి జరుగుతున్న పట్టభద్రుల ఓట్ల నమోదును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ కోరారు. సోమవారం పట్టభద్రుల ఓట్ల నమోదు, ఎన్నికలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

పట్టభద్రులు ఓట్లు నమోదు చేసుకోవాలి
అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌

ఒంగోలు (కార్పొరేషన్‌), అక్టోబరు 3 : ఈనెల 1వ తేదీ నుంచి జరుగుతున్న పట్టభద్రుల ఓట్ల నమోదును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ కోరారు. సోమవారం పట్టభద్రుల ఓట్ల నమోదు, ఎన్నికలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ నాయకులు, బూత్‌ కన్వీనర్లు, డివిజన్‌ నాయకులు వారి డివిజన్లలోని పట్టభద్రులను చైతన్యపరిచి, ఓట్లు నమోదు చేసుకునిటీడీపీ మద్దతుదారుల గెలుపునకు  కృషి చేయాలన్నారు. పట్టభద్రుల ఎన్నికలు రాబోయే 2024 సాధారణ ఎన్నికలకు శుభసూచికంగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కామేపల్లి శ్రీనివాసరావు, కార్పొరేటర్‌ దాచర్ల రమణయ్య, తెలుగు యువత అధ్యక్షుడు ముత్తన శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-10-04T05:26:06+05:30 IST