-
-
Home » Andhra Pradesh » Prakasam » Governments should promote education-NGTS-AndhraPradesh
-
ప్రభుత్వాలు విద్యను ప్రోత్సహించాలి
ABN , First Publish Date - 2022-09-13T05:56:22+05:30 IST
ప్రభుత్వాలు విద్యను ప్రోత్సహించాలని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఒంగోలు మండలం ఉలిచి గ్రామ జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో సోమవారం గుండ్లకమ్మ సామాజక సాహిత్య సేవాసమాఖ్య ఆధ్యర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విఠపు మాట్లాడుతూ పాఠశాలలను అధికారులు ,రాజకీయ నాయకులు పరిశీలించే విధానం ,వారి జోక్యం ఉండకూడదన్నారు. గ్రామస్థులే పాఠశాలలను ఉన్నతంగా నడుపుకొనేవిధానం ఉండాలన్నారు.

ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం
ఒంగోలు(రూరల్)సెప్టెంబరు12: ప్రభుత్వాలు విద్యను ప్రోత్సహించాలని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఒంగోలు మండలం ఉలిచి గ్రామ జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో సోమవారం గుండ్లకమ్మ సామాజక సాహిత్య సేవాసమాఖ్య ఆధ్యర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విఠపు మాట్లాడుతూ పాఠశాలలను అధికారులు ,రాజకీయ నాయకులు పరిశీలించే విధానం ,వారి జోక్యం ఉండకూడదన్నారు. గ్రామస్థులే పాఠశాలలను ఉన్నతంగా నడుపుకొనేవిధానం ఉండాలన్నారు. రాష్ట్రంలో 48వేల పాఠశాలలు ఉండగా, రాబోవు పది సంవత్సరాలలో పదివేల పాఠశాలలు మాత్రమే మిగిలే పరిస్థితులు ఉంటాయన్నారు. ఆయా గ్రామాల ప్రజలు ఐక్యంగా పోరాడతూ వాటిని నిలుపుకోవాలన్నారు. పొగాకు సమాఖ్య మాజీ అధ్యక్షుడు చుంచు శేషయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ప్రభుత్వాలు విద్యకన్నా ఇతర పనులు మోపడంతో విద్యపూర్తిగా వెనుక బడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. గ్రామంలో ఉన్నత పాఠశాల లేని రోజులలో డి. కోటేశ్వరరావు శ్రీశారదానికేతన్ పాఠశాల ఏర్పాటు చేసి అనేక మందికి ఉన్నత ఉద్యోగాలు వచ్చేవిధంగా కృషి చేశారన్నారు. శ్రీశారదానికేతన్ ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వపాఠశాలలను ప్రోత్సహించిన విధంగానే ప్రయివేటు పాఠశాలలను ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా ఉలిచి శ్రీశారదానికేతన్ ప్రిన్సిపాల్ కోటేశ్వరరావును, గ్రామంలో విద్య బోధించిన ఉపాధ్యాయులను , ఉద్యోగవిరమణ చేసిన ఉపాధ్యాయులను గ్రామస్థులు , నాటి విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చుంచు చలమయ్య ,నన్నపనేని చంద్రశేఖర్, నన్నవపనేని వెంకట్రావు, నన్నపనేని సుబ్బారావు , నన్నపనేని లీల , చుంచు రామాంజనేయులు, జడ్పీహైస్కూలు హెచ్ఎం సిహెచ్ కోటేశ్వరరావు ప్రాథమిక పాఠశాలలు హెచ్ఎంలు వి. శిరోమణి ,రాజరాజేశ్వరి ఉపాధ్యాయులు ,పూర్వవిద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను గుండ్లకమ్మ సామాజిక సాహిత్య సేవాసమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు మండవ సుబ్బారావు , పిల్లుట్ట సుధాకరరావు నిర్వహించారు.