నవరత్నాల పేరుతో ప్రభుత్వం మోసాలు

ABN , First Publish Date - 2022-09-28T06:28:16+05:30 IST

వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో రాష్ట్రంలో ప్రజ లను ర మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని వేములకోటలో మంగళవారం బాదుడేబాదుడు కార్యక్రమం నిర్వహించారు.

నవరత్నాల పేరుతో ప్రభుత్వం మోసాలు
మాట్లాడుతున్న నారాయణరెడ్డి

మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి

మార్కాపురం, సెప్టెంబరు 27: వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో రాష్ట్రంలో ప్రజ లను ర మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని వేములకోటలో మంగళవారం బాదుడేబాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ నవ బాదుళ్లలో భాగంగా ఇసుక ధరల పెంపు, జే మద్యం విక్రయాలు, పెట్రోల్‌ ధరల పెంపు, చెత్త పన్ను విధింపు, సిమెంట్‌ ధరల పెంపు, రిజిస్ట్రే షన్‌ చార్జీల పెంపు, నిత్యావసర ధరల పెంపు, ఆర్టీసీ చార్జీల పెంపు, విద్యుత్‌ చార్జీల పెంపును అమలు చేస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి వెంకట సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు దూదేకుల మస్తానయ్య, కౌన్సిలర్‌ యేరువ నారాయణరెడ్డి, మాజీ కౌన్సిలర్‌ బొంతల పుల్లా రావు, మండల అధ్యక్షుడు జవ్వాజి రామాంజ నేయరెడ్డి, ఏఎంసీ మాజీచైర్మన్‌ కాకర్ల శ్రీనివాసులు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ మౌలాలీ, నాయకులు జంకె రమణారెడ్డి, ఆవులయ్య, రాము పాల్గొన్నారు.

Read more