మంచి గుమ్మడి అధరహో!

ABN , First Publish Date - 2022-09-26T04:38:06+05:30 IST

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను తెచ్చిపెట్టే పంటలలో గుమ్మడి ముం దజలో ఉంది.

మంచి గుమ్మడి అధరహో!
కొత్తపాలెంలో హైదరాబాద్‌ మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన గుమ్మడి కాయల బస్తాలు

 వంద ఎకరాల్లో సాగు

ఎకరాకు 10 టన్నుల చొప్పున దిగుబడులు

రూ. 80 వేలకు పైబడి ఆదాయం

హైదరాబాద్‌ మార్కెట్‌కు ఎగుమతి

బల్లికురవ, సెప్టెంబరు 25: తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను తెచ్చిపెట్టే పంటలలో గుమ్మడి ముం దజలో ఉంది. ఈ ఏడాది మంచి గుమ్మడి ధరలు మొ దట్లో కాస్త తక్కువగా ఉన్నాయి. అయితే, గత వారం రోజుల నుంచి ధరలు పెరగటంతో రైతులు లాభాలు గడిస్తున్నారు. సరాసరిన ఎకరాకు రూ.80 వేల పైచిలు కు ఆదాయం వస్తుందని  రైతులు పేర్కొన్నారు.

బల్లికురవ మండలంలోని నక్కబొక్కలపాడు, మ ల్లాయపాలెం, కొప్పెరపాలెం, కోటవారిపాలెం, గంగపా లెం, కొణిదెన, కొత్తపాలెం, బల్లికురవ, గుంటుపల్లి, అంబడిపూడి, వల్లాపల్లి, కొమ్మినేనివారిపాలెం, ఎస్‌ఎల్‌ గుడిపాడు, వెలమవారిపాలెం తదితర గ్రామాలలో రై తులు గుమ్మడి పంటను సాగుచేశారు. ఖరీఫ్‌ పంట లలో భాగంగా సుమారు వంద ఎకరాలలో మంచి గుమ్మడి పంటను సాగు చేశారు. ఈపంట ఎకరా కు పెట్టుబడి అన్నీకలిపి రూ.10 వేలకు మించి కాలేదు. దిగుబడులు మాత్రం ఎకరాకు సరాసరిన 8 నుంచి 10 టన్నుల వరకు వస్తున్నాయి. మా ర్కెట్‌లో టన్ను రూ.8 వేల నుంచి రూ.10 వేల వర కు కొనుగోలు చేస్తున్నారు. గత నెలలో నాలుగు వే లు ఉన్న ధర వారం రోజుల నుంచి రూ.10 వేలకు చేరిందని రైతులు తెలిపారు. 

గాలి పంటగా పండే గుమ్మడి పంట మంచి లాభా లను తెచ్చి పెట్టిందని పలువురు రైతులు హర్షం వ్య క్తం చేస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా గు మ్మడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పలు వురు రైతులు హైదరాబాద్‌ మార్కెట్‌కు తరలిస్తు న్నారు. ప్రతిరోజు బల్లికురవ మండలంలోని పలు గ్రా మాల నుంచి నాలుగు లారీలలో గుమ్మడి కాయలు ఇతల ప్రాంతాలకు తరలివెళుతున్నాయి. కొందరు రైతులు మార్టూరు మార్కెట్‌లో గుమ్మడి కాయలను అమ్ముకొంటున్నారు. 

గత ఏడాది టన్ను రూ. 5 వేలకు అమ్మగా, ఇప్పు డు మరింత పెరగటం వల్ల లాభాలు కూడా పెరిగా యని రైతులు తెలిపారు. తక్కువ ఖర్చుతో గుమ్మడి పంట పండుతుందని వారు తెలిపారు. ఈ ఏడాది గుమ్మడి పంట వేసిన రైతులకు మంచి లాభాలు వ చ్చాయని వారు తెలిపారు.


గుమ్మడి సాగుతో లాభాలు

మా గ్రామంలో 30 ఎకరాల్లో రైతులు మంచి గుమ్మడి పంట ను సాగు చేశారు దిగుబడులు కూడా కొందరికి బాగా వచ్చాయి. టన్ను రూ.10 వేలకు కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడి ఎకరా కు రూ.10 వేలకు మించికాలేదు. పది టన్నుల వరకు దిగుబడులు వస్తున్నాయి. దసరా పండు గకు గుమ్మడి ధర మరింత పెరిగే అవకాశం ఉంది. తాను ఎకరాలో గుమ్మడి పంట సాగు చే శాను. ధర ఉంటే గుమ్మడి పంటకు మించిన పంట మరొకటి లేదు.

- దూళిపాళ్ల హనుమంతురావు,  రైతు, నక్కబొక్కలపాడు

Read more