బస్తాలలో ఇసుకను కొనేరోజులు వచ్చాయి..

ABN , First Publish Date - 2022-11-23T00:05:11+05:30 IST

వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా నదులు, వాగులు, వంకలను వద ల కుండా ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తూ దో చుకుంటున్నారని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు.

బస్తాలలో ఇసుకను కొనేరోజులు వచ్చాయి..

నదులు, వాగులు, వంకలను వదలని వైసీపీ నేతలు

ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌

అద్దంకి, నవంబరు 22: వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా నదులు, వాగులు, వంకలను వద ల కుండా ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తూ దో చుకుంటున్నారని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. అద్దంకి మండలంలోని కొంగపాడు, పట్టణంలో పలువురుని మంగళవారం పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే రవికుమార్‌ దృష్టి కి ఇసుక ధర పెంచిన విషయాన్ని స్థానికులు తీసుకువచ్చారు. ధరలు పెరగటంతో భవనాల నిర్మాణాలు నిలిపివేసే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్‌ మాట్లాడుతూ తెలుగుదేశం పాలనలో ఉచిత ఇసుక విధానం అమలులో ఉండేదన్నారు. రవాణా ఖర్చులతో కలిపి ట్రాక్టర్‌ ఇసుక గుండ్లకమ్మ నది నుండి అద్దంకి పట్ట ణానికి రూ.1200లకే దొరికేదని చెప్పారు. అదే ఇసుక వైసీపీ ప్రభు త్వంలో ఇటీవలవరకు రూ.3,500కు అమ్మారన్నారు. ఇప్పుడు ఏకంగా రూ.5 వేలకు పెంచి అమ్ముతున్నారన్నారు. రాబోయే రోజులలో ఇసు కను బస్తాల లెక్కన అమ్ముతారేమోనని అన్నారు. వాగులు, వంకలు, నదులు వదలకుండా వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా ఇసుక త వ్వకాలు చేస్తున్నారన్నారు. జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక రేట్ల ను తగ్గించి పేద వారిని ఆదుకుంటాను అని చెప్పి ఇప్పుడు ట్రాక్టర్‌ ఇసుక ఒక్కసారి గా రూ.5 వేల నుంచి రూ.10 వేల వర కు అమ్ముతున్నారన్నారు. దీం తో పలువురు భవనాల నిర్మా ణాన్ని మానుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. నిర్మాణ రం గంలో కూలీలు ఉపాధి లేకుం డా పోయిందన్నారు.

వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఇసుక పాలసీ అధి కార పార్టీ నాయకులకు పెద్ద ఆదాయ వనరుగా మారిందని ఎమ్మెల్యే రవికుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్‌లు వైసీపీ నా యకుల చేతిలో పెట్టుకొని పరిమితి కి మించి ఇసుక తవ్వకాలు చేసి కోట్ల రూపాయల ఆదాయం గడిస్తున్నారన్నారు. పేదల కడుపుకొట్టి పార్టీ పెద్దల కడుపు నింపుతున్నారన్నారు. సామాన్యునికి ఇసుక భారం కాకూడదని టీడీపీ ప్రభుత్వం 2016 నుంచి ఉచితంగా అందజేసిం దన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్వార్ధంతో తమ మద్దతు దారులకు దోచి పెట్టే విధంగా పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే రవి కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై భారం వేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలంటున్న వైసీపీ ప్రభుత్వం నూతన ఇసుక విధానాన్ని రద్దు చేసి ఉచిత ఇసుక విధానాన్ని తీసుకు రావాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ర్టాలకు తరలిపోతున్నాయని అన్నారు. దీంతో యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయా యన్నారు. మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు మద్యం ఏరులై పారుస్తున్నారని ఎమ్మెల్యే రవికుమార్‌ ధ్వజమెత్తారు.

Updated Date - 2022-11-23T00:05:16+05:30 IST