గౌరీనందన.. సెలవిక

ABN , First Publish Date - 2022-09-11T06:40:34+05:30 IST

పట్టణంలోని ఎన్‌టీఆర్‌ కూడలిలో ఏర్పాటు చేసిన మహాగణేశుని ప్రతిమకు శనివారం సాయంత్రం నిమజ్జనం చేశారు. అంతకుముందు 11 రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

గౌరీనందన.. సెలవిక
ఎర్రగొండపాలెం నుంచి నిమజ్జనానికి తరలుతున్న మహాగణపతి

ఉత్సాహంగా వినాయక నిమజ్జనాలు

ఎర్రగొండపాలెం, సెప్టెంబరు 10 : పట్టణంలోని ఎన్‌టీఆర్‌ కూడలిలో ఏర్పాటు చేసిన మహాగణేశుని ప్రతిమకు  శనివారం సాయంత్రం నిమజ్జనం చేశారు. అంతకుముందు 11 రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిమజ్జన యాత్రలో నరజాముల తాండ గిరిజన బాలికలు కోలాట ప్రదర్శన భక్తులను ఆకట్టు కుంది. గణేశుని ఉత్సవ కమిటి ప్రెండ్స్‌ యాత్‌ అసోసియేషన్‌ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.  త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామం వద్ద నాగార్జునసాగర్‌ కాలువలో  వినాయకుని నిమజ్జనం చేశారు.  ఈ సందర్భంగా లడ్డూ వేలం  రూ.1,01,000 పలికింది.  గ్రామానికి చెందిన పాల పాలవ్యాపారి లగడపాటి కోటయ్య లడ్డూను దక్కించుకున్నారు. మండపంలో ఉంచిన స్వామివారి కలశాన్ని కైపు వెంకటరెడ్డి 85 వేలు, అకౌంటుబుక్స్‌ను వై.కొత్తపల్లికి చెందిన నక్కా వెంకటేశ్వర్లు 45 వేలు, మహాగణేశుని చేతిలో ఉంచిన కలాన్ని మారం శ్రీనివాసరెడ్డి రూ.7వేలకు దక్కించుకున్నారు.

తర్లుపాడు : తర్లుపాడులోని కోటవీధిలో యాదవ్‌ యూత్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాన్ని ట్రాక్టర్‌పై తర్లుపాడు పురవీధుల్లో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు వార్లు పోసి కాయకర్పూరాలు సమర్పించి మొక్కు లు  తీర్చుకున్నారు. గ్రామోత్సవంలో యువ కులు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. అనంతరం గుండ్లకమ్మ వాగులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

పెద్దదోర్నాల : మండలంలోని ఐనముక్కుల గ్రామంలో నూతనంగా విఘ్నేశ్వర దేవాలయం నిర్మించి, వర సిద్ధి వినాయకుని  విగ్రహ ప్రతిష్ట నిర్వహించిన 41 రోజలు పండుగను శనివారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయ అర్చకులు కాకర్ల లక్ష్మీ ప్రసాద్‌ శర్మ, ఆవంచ శివకుమార్‌ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో తరలి వెళ్లి స్వామి వారికి నివేధించారు. స్వామి వారిని సేవించారు. అనంతరం తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు పీ.కోటిరెడ్డి, జంగిలి పిచ్చయ్య, చిట్ట్యాల రామకృష్ణారెడ్డి, శంకర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, టీ.ఆదినారాయణరెడ్డి, మూల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Read more