గన్నవరం వాగు ఉధృతం

ABN , First Publish Date - 2022-10-09T04:18:05+05:30 IST

నాలుగు రోజులగా కురుస్తున్న వర్షాలకు మండలంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి ఎడ తెరిపిలేని వర్షాలతో గన్నవరంవాగు శనివారం ఉధృతంగా ప్రవహి స్తోంది.

గన్నవరం వాగు ఉధృతం

వెలిగండ్ల, అక్టోబర్‌ 8 :  నాలుగు రోజులగా కురుస్తున్న వర్షాలకు మండలంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి ఎడ తెరిపిలేని వర్షాలతో  గన్నవరంవాగు శనివారం   ఉధృతంగా ప్రవహి స్తోంది. దీంతో గన్నవరం, గండ్లోపల్లి, చెన్నంపల్లి, గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎగువ ప్రాంతాల్లో కురి సిన వర్షాలకు వరద నీరు పెరిగింది.  ప్రయాణంతోపాటు విద్యుత్‌ సేవ లకు అంతరాయం ఏర్పడింది.

Read more