వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-09-29T04:17:37+05:30 IST

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మండలంలోని ఆయా గ్రామాల్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆయా అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలతోపాటు, సాంస్కృతిక, కోలాట భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తిని చాటుకుంటున్నారు. పర్చూరులోని గ్రామదేవత అద్దంకి నాంచారమ్మ అమ్మవారి దేవస్థానంలో బుధవారం అమ్మవారు గాయత్రీ దేవిగా అలంకరించి విశిష్టపూజలు చేశారు. వేడుకల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
పర్చూరులోని అద్దంకి నాంచారమ్మ అమ్మవారి దేవస్థానంలో గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు.

గాయత్రీ దేవిగా అమ్మవార్లకు అలంకరణ

పర్చూరు, సెప్టెంబరు 28: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మండలంలోని ఆయా గ్రామాల్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.  ఇందులో భాగంగా ఆయా అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలతోపాటు, సాంస్కృతిక, కోలాట భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తిని చాటుకుంటున్నారు. పర్చూరులోని గ్రామదేవత అద్దంకి నాంచారమ్మ అమ్మవారి దేవస్థానంలో బుధవారం అమ్మవారు  గాయత్రీ దేవిగా అలంకరించి విశిష్టపూజలు చేశారు. వేడుకల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. అలాగే శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు.  రామాలయం వీధిలోని నర్రా వెంకట్‌, లక్ష్మీసుధ దంపతులు ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఎత్తున భక్తులు తరలి రావటంతో ప్రాంగణం కిక్కిరిసింది. 


గాయత్రీదేవి ఆలంకరణలో పార్వతి అమ్మవారు

బల్లికురవ  : దసరా నవరాత్రులలో భాగంగా బుధవారం పలు గ్రామాలలో గాయత్రీ దేవి అలంకరణలో అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. మండలంలోని కొండాయపాలెం గ్రామంలో గంగాపార్వతి సమేత నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో పార్వతి అమ్మవారు గాయత్రీ దేవి ఆలంకరణలో భక్తులకు దర్శన మిచ్చారు. అలానే కొత్తపాలెం, చెన్నుపల్లి, వైదన, కొత్తపాలెం, నక్కబొక్కలపాడు గ్రామాలలో ఉన్న దేవాలయాలలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. దసరా నవరాత్రులతో గ్రామాలలో  సందడి నెలకొంది.

Updated Date - 2022-09-29T04:17:37+05:30 IST