ఎట్టకేలకు వైద్యశాలలకు నిధులు

ABN , First Publish Date - 2022-08-31T06:12:40+05:30 IST

ఎట్టకేలకు వైద్యారోగ్యశాఖకు నిధులు వచ్చాయి. హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌(హెచ్‌డీఎస్‌) నుంచి ఐదారు నెలల తర్వాత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులను ఇచ్చింది. జిల్లాల విభజన అనంతరం వీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి. అందులో భాగంగా మన జిల్లాకు రూ.1.84 కోట్లు మంజూరు చేసింది.

ఎట్టకేలకు వైద్యశాలలకు నిధులు

జిల్లాకు రూ.1.84 కోట్లు మంజూరు

ఒక్కో పీహెచ్‌సీకి రూ.1.75లక్షలు,  సీహెచ్‌సీకి రూ.5లక్షలు

మార్కాపురం జిల్లా వైద్యశాలకు రూ.10లక్షలు

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 30 : ఎట్టకేలకు వైద్యారోగ్యశాఖకు నిధులు వచ్చాయి. హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌(హెచ్‌డీఎస్‌) నుంచి ఐదారు నెలల తర్వాత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులను ఇచ్చింది. జిల్లాల విభజన అనంతరం వీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి. అందులో భాగంగా మన జిల్లాకు రూ.1.84 కోట్లు మంజూరు చేసింది. ఆ మొత్తాన్ని జిల్లా వైద్యారోగ్యఖాధికారులు ఆయా వైద్యశాలలో అభివృద్ధి కోసం కేటాయించారు విభజన అనంతరం జిల్లాలో 64 పీహెచ్‌సీలు ఉండగా ఒక్కో దానికి రూ.1.75లక్షలు మంజూరు చేశారు. మార్కాపురంలోని జిల్లా వైద్యశాలకు రూ.10లక్షలు, ఎనిమిది కమ్యూనిటి హెల్త్‌ సెంటర్లు, రెండు ఏరియా ఆస్పత్రులు ఉండగా ఒక్కోదానికి  రూ.5లక్షల చొప్పున కేటాయించారు. ఈ నిధులతో ఆయా వైద్యశాలల అభివృద్ధితోపాటు మందులు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవచ్చు. అయితే ఈ నిధులు వినియోగించాలంటే తప్పనిసరిగా ఆ వైద్యశాలల అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించాలి. పీహెచ్‌సీలకు ఎంపీపీలు చైర్మన్‌గా ఉండగా జిల్లా వైద్యశాల, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా వైద్యశాలలకు స్థానిక ఎమ్మెల్యేలు చైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ఆత్యవసర మందులు, ఆపరేషన్‌ థియేటర్‌లో సదుపాయాలు, ఆయాకేంద్రాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు, కుర్చీలు, బెడ్లు, దిండ్లు వంటివి ఈ నిధుల ద్వారా సమకూర్చుకునే అవకాశం లభించింది. 

Updated Date - 2022-08-31T06:12:40+05:30 IST