సీపీఎస్‌ రద్ధయ్యేవరకు పోరాటం

ABN , First Publish Date - 2022-04-24T07:39:38+05:30 IST

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసే వరకు యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో పోరాటం చేయనున్నట్లు ఆ సంఘం కనిగిరి అధ్యక్షుడు మూలె రమణారెడ్డి అన్నారు.

సీపీఎస్‌ రద్ధయ్యేవరకు పోరాటం
సీ.ఎస్‌.పురంలో బైకు ర్యాలీ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు

పోరుగర్జనలో యూటీఎఫ్‌ నేతలు
పలు మండలాల్లో కొనసాగిన బైక్‌ ర్యాలీలు
కనిగిరి, ఏప్రిల్‌ 23:
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసే వరకు యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో పోరాటం చేయనున్నట్లు ఆ సంఘం కనిగిరి అధ్యక్షుడు మూలె రమణారెడ్డి అన్నారు. యూటిఎఫ్‌ నాయకులను అక్రమ అరెస్ట్‌లు  ఖండిస్తూ కనిగిరిలో శనివారం రాత్రి  ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక సుగుణావతమ్మ కూడలిలో యూటిఎఫ్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. సీఎం జగన్‌రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోగా యూటిఎఫ్‌ సంఘ ఉపాధ్యాయులపై అక్రమ అరెస్‌లు, కేసులు బనాయించాలని చూడటం సిగ్గుచేటు అన్నారు. దర్శిలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న యూటిఎఫ్‌ రాష్ట్ర , జిల్లా నాయకులను అడ్డుకోవటం తగదన్నారు. పలు మండలాల్లో పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డారు. సీఎం జగన్‌రెడ్డి ఇకనైనా దుర్మార్గపు ఆలోచలను చేయకుండా పాత పింఛన్‌ విధానాన్ని అమలుజేయాలన్నారు. ార్యక్రమంలో యూటిఎఫ్‌ ప్రధానకార్యదర్శి బత్తుల రుషేంద్ర జిల్లా కార్యదర్శి ఖాజా రహంతుల్లా, నాయకులు పాల్గొన్నారు.
దొనకొండ  : సీపీఎస్‌ రద్దు అయ్యేవరకు యూటీఎఫ్‌ పోరాటం కొనసాగిస్తుందని ఆ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కె శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలనే ఏజెండాతో యుటీఎఫ్‌ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చిత్తూరు సీపీఎస్‌ బైక్‌ జాతా జిల్లాలోని కనిగిరి, పొదిలి, మార్కాపురం, వైపాలెం, త్రిపురాంతకం మీదుగా శనివారం దొనకొండకు చేరింది. ఈ సందర్భంగా దొనకొండ వీధుల్లో ర్యాలీ  మానవహారం చేపట్టారు. ఈ నెల 25న విజయవాడలో ఐదువేల మోటార్‌సైకిళ్లతో ముఖ్య కేంద్రాల వద్ద బైక్‌ రాలీ, మరియు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐక్య ఉపాధ్యాయ పత్రిక సంపాధకులు పి బాబురెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్‌ టి రాజశేఖర్‌, జిల్లా అధ్యక్షుడు వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్‌ రవి, మండల గౌరవ అధ్యక్షుడు కటారు వెంకటేశ్వర్లు, జిల్లా కౌన్సిలర్లు బి వెంకటేశ్వర్లు, బి సత్యనారాయణ, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే.సంపత్‌కుమార్‌, రోశయ్య, మండల కమిటీ సభ్యులు జె లక్ష్మీనారాయణ, ఆర్‌.కోటేశ్వరరావు, సురేష్‌, మస్తాన్‌, వి సుకన్య, కే.లత, కురిచేడు, తాళ్ళూరు, ముండ్లమూరు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు అధికసంఖ్యలో యుటీఎఫ్‌ ప్రతినిదులు పాల్గొన్నారు.
కురిచేడు: కంట్రిబ్యూటర్‌ పెన్షన్‌ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలంటూ ఉపాధ్యాయులు చాలా కాలంగా కోరుతున్నారు. ఏపియుటియఫ్‌ శాఖ తరపున శనివారం కురిచేడులో ఉపాధ్యాయులు సీపీఎస్‌ రద్దు చేయాలని నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో ఐక్యఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులు బాబుల్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే సిపియస్‌ రద్దుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ర్యాలీలో ఉపాధ్యాయుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  కార్యక్రమంలో యుటటియఫ్‌ జిల్లా శాఖ అధిక్షులు వీరారెడ్డి, కార్యదర్శి ఎస్‌ రవి, షేక్‌ అబ్దుల్‌హై, వెంకటరెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్‌ రాజశేఖర్‌, యుటియఫ్‌ కురిచేడు అధ్యక్షులు ఏ శ్రీనివాస రెడ్డి, ప్రధాన కార్యదర్శి యు మాధవరావు, కోశాధికారి శ్రీనివాస రావు తదితరులు  పాల్గొన్నారు.
సీఎ్‌సపురం : సీపీఎ్‌సను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు ఐ.కొండయ్య, జె.వెంకటరావు, నాయబ్‌రసూల్‌, సురేష్‌, పాదుషా సీఐటీయు నాయకులు ఎస్‌.తిరుపతిరెడ్డి, బత్తుల జ్ఞాన్‌రాజ్‌, ఓబుల్‌రెడ్డి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల అరెస్టు గర్హనీయం
పామూరు : సీపీయస్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ.. ప్రకాశం జిల్లాలో ప్రజాస్యామ్యబద్ధంగా సాగుతున్న బైక్‌ ర్యాలీని దర్శిలో పోలీసులు అడ్డుకోని శాసనమండలి సభ్యులు యండపల్లి శ్రీనివాసరెడ్డి, ఐక్య ఉపాధ్యాయ సంపాదకులు పి బాబురెడ్డి,రాష్ట్ర గౌరవఅధ్యక్షులు కే,శ్రీనివాసరావులను అరెస్టు చేయడం గర్హనీయమని యూటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ పి తిరుపతిరెడ్డి, మండల కమిటి అధ్యక్ష కార్యదర్శులు డి.ఉదయకుమార్‌, కే.నాగేశ్వరరావు ఒక ప్రకటనలో ఖండించారు. బేషరుతుగా విడదల చేసి బైక్‌ ర్యాలికి సహకరించాలని వారు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-04-24T07:39:38+05:30 IST