నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-12-13T22:42:22+05:30 IST

తుఫాన్‌ వలన పంటలు కోల్పోయిన రైతు లను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు సూచించారు. దర్శి పట్టణ సమీపంలో దెబ్బతిన్న పత్తి పంటను టీడీపీ నాయకులు పరిశీలించారు.

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
దెబ్బతిన్న పత్తిని పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే పాపారావు, నాయకులు

దర్శి, డిసెంబరు 13 : తుఫాన్‌ వలన పంటలు కోల్పోయిన రైతు లను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు సూచించారు. దర్శి పట్టణ సమీపంలో దెబ్బతిన్న పత్తి పంటను టీడీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అ న్ని రంగాల పంటలు వర్షాలకు నీట మునగడంతో రైతులు సర్వం కో ల్పోయి అల్లాడుతున్నారన్నారు. అధికారులు నష్టాన్ని అంచనా వేసి పరి హారం అందించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చి ట్టే వెంకటేశ్వర్లు, నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, పట్టణ అధ్యక్షుడు యాదగిరి వాసు, నాయకులు సంగా తిరుపతిరావు, పారా గాలయ్య, నారపుశెట్టి మధు, జూపల్లి కోటేశ్వరరావు, బేళ్ల శ్రీనివాసరావు, అనిల్‌, దినకర్‌, వెంకటస్వామి, నారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T22:42:22+05:30 IST

Read more