రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2022-03-05T05:29:15+05:30 IST

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కారంచేడు ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు అన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మాట్లాడుతున్న ఎంపీపీ వాసుబాబు

ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు

కారంచేడు(పర్చూరు), మార్చి 4: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కారంచేడు ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు అన్నారు. శుక్రవా రం జరిగిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి ఆయన అ ధ్యక్షత వహించి మాట్లాడారు.  గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతు లు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం పెద్దఎత్తున ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. 21 రోజల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్టు చెప్పారు. అధికారులు సమన్వయంతో పని చేసి కారంచేడు మండల అభివృద్ధికి తోడ్పాటునందించాలని అన్నారు. ఏవో కె.శివనాగప్రసాద్‌ మాట్లాడుతూ ఇప్పటివరకు మండలంలో 4212 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు చెప్పారు.  

కోరం అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో తొలుత కారంచేడు -2 ఎంపీటీసీ సభ్యుడు యార్లగడ్డ అక్కయ్య చౌదరి పంచాయతీ నిధు ల దుర్వినియోగ విషయాన్ని లేవనెత్తారు. నిధుల దుర్వినియోగంపై డీపీవోకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దీనిపై విజిలెన్స్‌ విచారణకు ఆ దేశాలు కూడా జారీచేసినా నేటికీ పూర్తికాక పోవటం విచారకరమన్నా రు. నిధులు దుర్వినియోగం ఆరు దశలలో జరిగనప్పటికీ కేవలం ఒ క్కరిపై మాత్రమే విచారణ జరుగుతుందన్నారు. దీనిపై మండల కమి టీ దృష్టిసారించి బాధ్యులందరిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవా లన్నారు. ఎంపీపీ మాట్లాడుతూ డీపీవో ఉత్తర్వుల ప్రకారం విచారణ జరుగుతుందన్నారు.  దీనిపై మరలా విజిలెన్స్‌ విచారణ కోరలేమని చెప్పారు. అనంరతం ఆయాశాఖల వారీగా అభివృద్ధి పనులపై చర్చిం చారు. సమావేశంలో ఎంపీడీవో రాజేష్‌బాబు, జడ్పీటీసీ యార్లగడ్డ రజనీ, వైస్‌ ఎంపీపీలు యార్లగడ్డ సుబ్బారావు, ఐనంపూడి వనిత, ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

Read more