-
-
Home » Andhra Pradesh » Prakasam » Farmer welfare is the aim of the government-MRGS-AndhraPradesh
-
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2022-06-08T05:18:22+05:30 IST
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని శాప్‌నెట్ చైర్మన్, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.

శాప్‌నెట్ చైర్మన్ బాచిన కృష్ణచైతన్య
అద్దంకి, జూన్ 7: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని శాప్‌నెట్ చైర్మన్, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా నియోజకవర్గంలో మంజూరైన 43 ట్రాక్టర్ లను మంగళవారం సాయంత్రం స్థానిక బం గ్లా రోడ్డులో జెండా ఊపి ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. అ ద్దంకి మండలానికి 15, సంత మాగులూరుకు 10, బల్లికురవ, పంగు లూరు, కొరిశపాడు మండలాలకు ఆరు ట్రాక్టర్‌లు చొప్పున అంద జేశారు. ముందుగా శింగరకొండ రోడ్డులో అద్దంకి పట్టణంలో వార్డు కమిటీల సభ్యుల ఎన్నిక సమావేశం నిర్వహించగా కృష్ణచైతన్య ముఖ్య అతిథిగా హజరయ్యారు.
కార్యక్రమాలలో మండల వ్యవశాయశాఖ అధికారులు కొర్రపాటి వెంకటకృష్ణ, కుమారి, లావణ్య, శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ జ్యోతి హనుమంతరావు, అవిశన ప్రబాకరరెడ్డి, సంతమాగులూరు జడ్పీటీసీ అడవి శ్రీనివవాసరావు, వైసీపీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణ మూర్తి, సందిరెడ్డి రమేష్, రామిరెడ్డి ఆదిరెడ్డి, కొంచా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
పంగులూరు, జూన్ 7: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అంద జేస్తున్నట్టు శాప్‌నెట్ చైర్మన్ బాచిన కృష్ణచైతన్య అన్నారు. మండలం లోని భగవాన్‌రాజుపాలెంలో మంగళవారం రాత్రి జరిగిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఎర్రం శ్రీనివాసరెడ్డి, రాయిణి వెంకట సుబ్బారావు, సర్పంచ్ డేవిడ్‌రాజు, సందిపాగు బుజ్జి, నార్నె శ్రీనివా సులు, జాగర్లమూడి వెంకటరావు, రాయపాటి శ్రీను, భాస్కరరాజు తదితరులు పాల్గొన్నారు