గణేశునికి ఘనంగా వీడ్కోలు

ABN , First Publish Date - 2022-09-11T04:46:30+05:30 IST

మండలంలోని శంకరాపురంలో తెలుగు యువత ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన గణేశునికి ఘనంగా వీ డ్కోలు పలికారు.

గణేశునికి ఘనంగా వీడ్కోలు
తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తున్న నేతలు

భారీ ఊరేగింపుగా తరలింపు

స్వామి ప్రసాదానికి వేలంపాట 

ముండ్లమూరు, సెప్టెంబరు 10 : మండలంలోని శంకరాపురంలో తెలుగు యువత ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన గణేశునికి ఘనంగా వీ డ్కోలు పలికారు. పది రోజుల పాటు భక్తులతో విశేషంగా పూజలు అందుకొని శనివారం తరలించారు. కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు, టీడీపీ మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, సర్పంచ్‌ కూరపాటి మహేశ్వరి నారాయణ స్వామి చేపట్టగా పెద్ద ఎత్తున టీడీపీకి చెందిన యువకులు పసుపు టీ షర్టులు ధరించి గులాంలు చల్లుకుంటూ బాణసంచా కాల్చుకుంటూ వీధుల్లో ఊరేగించారు. కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శంకరాపురంలో ఊరేగింపు అనంతరం తిమ్మాయపా లెం మీదుగా తీసుకు వెళ్లి గుండ్లకమ్మలో నిమజ్జనం చేశారు. శంకరాపురంలో టీడీపీ వర్గీయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఉంచిన 11 కేజీల స్వామి ల డ్డూను వేలం పాటలో పాడి గ్రామానికి చెం దిన ఆదిశేషు దక్కించుకున్నారు. ఆయనను కమిటీ సభ్యులు అభినందించారు. పసుపుగల్లులో బూచేపల్లి యూత్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని ఉత్సాహంగా ని మజ్జనానికి తరలించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన స్వా మి లడ్డూని రూ.1.05లక్షలకు వేలంపాటలో మే డగం గోపాలరెడ్డి దక్కించుకున్నారు. అతడిని నిర్వాహకులు అభినందించారు.  

పామూరులో..

పామూరు :  మల్లి కార్జునరెడ్డి ఆసుపత్రిలో  ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి శనివారం  శోభాయాత్రగా తరలించి నిమజ్జనం చేశారు.    ఏటా 11 రోజులపాటు విఘ్నేశ్వరుడిని ప్రతి ష్టించి పూజలు నిర్వహిస్తామని డాక్టర్‌ ఎం. మల్లికార్జునరెడ్డి తెలిపారు. అనంతరం పా త చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమం లో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

తాళ్లూరులో..

తాళ్లూరు : గత 11 రోజులుగా పూజలందుకున్న  గణనాథులను మండలంలోని పలుగ్రామాల నుంచి శనివారం సందడిగా నిమజ్జనానికి తరలించారు.  11 రోజుల పాటు నిత్యపూజలందుకున్న లంబోదరులు కొత్తపాలెం, తా ళ్లూరు, వెలుగువారిపాలెం, తూర్పుగంగవరం నుంచి నిమజ్జనానికి తరలివెళ్లారు.  కొత్తపాలెంలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  విఘ్నేశ్వరుడి నిమజ్జనంలో టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఊరేగింపులో  ఎలాంటి ఇబ్బందులు చోటుచేసుకుండా ఎస్‌ఐ నరసింహారావు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. 


Read more