తప్పుడు కేసులు పెడితే సహించేది లేదు

ABN , First Publish Date - 2022-10-07T04:33:37+05:30 IST

టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు.

తప్పుడు కేసులు పెడితే సహించేది లేదు
ఎస్సైతో మాట్లాడుతున్న ఉగ్ర

టీడీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ఉగ్ర

కనిగిరి, అక్టోబరు 6 : టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. కనిగిరిలోని టీడీపీ ఆర్యవైశ్య నాయకులపై పెట్టిన తప్పుడు కేసును ఖండిస్తూ గురువారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ దాసు ప్రసాద్‌కు కేసుకు దారి తీసిన సందర్భాన్ని వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ భగవంతుని కార్యక్రమంలో పార్టీలను తీసుకువచ్చి తన కార్యకర్తలను ఇబ్బందులు పెడితే ఎంత దూరం అయినా వెళ్తానని చెప్పారు. దేవుని కార్యక్రమంలో పార్టీలకతీతంగా తమ పార్టీ వారు పాల్గొని విజయవంతానికి కృషి చేస్తుంటే చూస్తూ ఓర్చలేకపోవటం బాధాకరమన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో టీడీపీ నాయకులు కొట్టినట్లుగా కౌన్సిలర్‌ కుమారుడు ఫిర్యాదు చేయగా, అర్ధరాత్రి టీడీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేయటం తగదన్నారు. వైసీపీకి చెందిన ఓ కౌన్సిలర్‌ తన పలుకుబడిని ఉపయోగించాలనుకుంటే సిగ్గుచేటన్నారు. వైసీపీ వాళ్లు చేసిన అక్రమ ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఎస్‌ఐని డాక్టర్‌ ఉగ్ర కోరారు. నాయకులు వీవీఆర్‌ మనోహరరావు (చిరంజీవి) తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, కొలిపర్తి మారతీ కుమార్‌గుప్తా, పువ్వాడి శివప్రసాద్‌గుప్తా ఉన్నారు.

Read more