వైసీపీ పాలనలో అంతా నష్టమే!

ABN , First Publish Date - 2022-09-14T04:50:53+05:30 IST

వైసీపీ పాలనలో అన్నివర్గాలు తీవ్రంగా నష్టపోయాయని ఎమ్మె ల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనలో అంతా నష్టమే!
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ధ్వజం

సంతమాగులూరు, సెప్టెంబరు 13: వైసీపీ పాలనలో అన్నివర్గాలు తీవ్రంగా నష్టపోయాయని ఎమ్మె ల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం పుట్టావారిపాలెం లోని ఎమ్మెల్యే అతిథిగృహంలో నాయకులు, కా ర్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. బూత్‌ కన్వీనర్లు  ఓటరు లిస్టులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అ ప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీ సభ్యత్వం న మోదు వేగవంతం చేయాలన్నారు. వైసీపీ ప్రభు త్వంపై చేసే పోరాటంలో కార్యకర్తలకు భరోసా ఇచ్చేలా గ్రామస్థాయి నుంచి  నాయకులు వ్యవహరించాలన్నారు. అధికార పార్టీ నేతల అవినీతి పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు.  వీటి పై గళ మెత్తాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే రవికుమార్‌ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగ న్మోహన్‌ రెడ్డి ఒక్క చాన్స్‌ ఇవ్వండంటూ ప్రజల ను నమ్మించి అధికారంలోకి వచ్చారన్నారు. చివ రికి ప్రజలను నట్టేట ముంచారని, ఇది చివరి చాన్స్‌గా మిగిలిపోవాలన్నారు. 

రైతుల సమస్యలు, నిత్యావసర సరుకుల పె రుగుదల, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ ప థకాల్లో కోత, గ్రామాల్లో పాఠశాలల మూసివేత తదితర నిర్ణయాలతో ప్రజలకు ఎదురవుతన్న ఇ బ్బందులను వివరించి క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ ప్ర భుత్వ హయాంలో దళితులకు ఎన్నో పథకాలను అమలుచేశామన్నారు.  వాటిన రద్దు చేసిన ఘ నత జగన్‌రెడ్డిదేనని చెప్పారు.  దళితులు, గిరిజనులు ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌ వా రికే శఠగోపం పెట్టారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకం ద్వా రా ఎస్సీ విద్యార్థులను విదేశాలకు పంపి చదివించినట్టు గుర్తు చేశారు. కల్యాణ మిత్ర ద్వారా పెళ్ళి రోజునే రూ. 50 వేలు సాయం చేసినట్టు చెప్పారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వీటిపై రకరకాల నిబంధనలు పెట్టి అందకుండా చేస్తుంద న్నారు. సమావేశంలో పార్టీ నేతలు సన్నెబోయిన ఏడుకొండలు, ఏసోబు, తేలప్రోలు రమేష్‌, గోవిందమ్మ, నాగబోతు సుజాత తదితరులు పాల్గొన్నారు.


Read more