అందరివాడు వీరబోజయ్యచారి

ABN , First Publish Date - 2022-03-17T04:28:55+05:30 IST

వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణిస్తూనే విశ్వబ్రాహ్మణ సంఘం బలోపేతానికి తన వంతుగా కృషి చేసిన వీరబోజయ్యచారి అందరివాడుగా గుర్తింపు పొందాడని మండల టీడీపీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీలు బొల్లా మాల్యాద్రి చౌదరి, మోరబోయిన హుస్సేన్‌రావు యాదవ్‌లు అన్నారు. పామూరు పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షుడు, విశ్వబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొగ్గవరపు వీరబోజయ్యచారి దశదిశకర్మ బుధవారం కుటుం బసభ్యులు నిర్వహించారు.

అందరివాడు వీరబోజయ్యచారి
బోజయ్యచారి చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న టీడీపీ శ్రేణులు

పామూరు, మార్చి 16: వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణిస్తూనే విశ్వబ్రాహ్మణ సంఘం బలోపేతానికి తన వంతుగా కృషి చేసిన వీరబోజయ్యచారి అందరివాడుగా గుర్తింపు పొందాడని మండల టీడీపీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీలు బొల్లా మాల్యాద్రి చౌదరి, మోరబోయిన హుస్సేన్‌రావు యాదవ్‌లు అన్నారు. పామూరు పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షుడు, విశ్వబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొగ్గవరపు వీరబోజయ్యచారి దశదిశకర్మ బుధవారం కుటుం బసభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి వద్ద ఏర్పాటు చేసిన బోజయ్యచారి చిత్రపటానికి టీడీపీ నాయకులు పాల్గొని సాయిబ్రహ్మం, వినోద్‌ బ్రహ్మంతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఐదు దఫాలుగా పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షుడుగా వ్యవహరించి అందిరి మన్ననలు పొందారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడుసుమల్లి ప్రభాకర్‌చౌదరి, ఎం. గంగరాజు యాదవ్‌, షేక్‌ గౌస్‌బాష, గుంటుపల్లి శ్రీనివాసులు, పువ్వాడి వెంకటేశ్వర్లు తదితరులు నివాళులు అర్పించారు. విరాట్‌నగర్‌ వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థాన కమిటీ సభ్యులు వినుకొండ రామాచారి, ముండ్లపాటి దొరసానయ్యాచారి, పునుగూటి వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.  

Read more