ప్రతి ఓటరు పరిశీలనను పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-11-30T22:42:35+05:30 IST

టీడీపీ పట్టణ క్లస్టర్‌ పరిధిలో ప్రతి ఓటరు పరిశీలనను త్వరితిగతిన పూర్తి చేయాలని జడ్పీటీసీ మాజీ అధ్యక్షుడు బొల్లా మాల్యాద్రిచౌదరి సూచించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో పట్టణ బూత్‌ కమిటీ క్లస్టర్‌ యూనిట్‌ ఇన్‌చార్జిల సమావేశం టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు షేక్‌ ఖాజారహంతుల్లా అధ్యక్షతన బుధవారం జరిగింది.

ప్రతి ఓటరు పరిశీలనను పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న బీఎంసీ

పామూరు, నవంబరు 30 : టీడీపీ పట్టణ క్లస్టర్‌ పరిధిలో ప్రతి ఓటరు పరిశీలనను త్వరితిగతిన పూర్తి చేయాలని జడ్పీటీసీ మాజీ అధ్యక్షుడు బొల్లా మాల్యాద్రిచౌదరి సూచించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో పట్టణ బూత్‌ కమిటీ క్లస్టర్‌ యూనిట్‌ ఇన్‌చార్జిల సమావేశం టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు షేక్‌ ఖాజారహంతుల్లా అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సమావేశంలో బొల్లా మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్త ఒక సైనికుడులా పని చేయాలన్నారు. 18 క్లస్టర్‌ పరిధిలో ఓటరు పూర్తి సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తు ఉగ్రనరసింహారెడ్డి విజయం కోసం కృషి చేయాలన్నారు. సమావేశంలో ఏ ప్రభాకర్‌చౌదరి, సయ్యద్‌ అమీర్‌బాబు, వైఎస్‌ ప్రసాద్‌రెడ్డి, ఆర్‌ఆర్‌ రఫీ, యు హరిబాబు, డోలా శేషాద్రి, షేక్‌ గౌస్‌బాష, దేవరపు మాల్యాద్రి, పందిటి హరీష్‌, టీవీకే సుబ్బారావు, ఇర్రి కోటిరెడ్డి, మోషే సయ్యద్‌ ఖాదర్‌బాష, గుత్తి మహేష్‌, పత్తు మస్తాన్‌, కోనా చెన్నయ్య, ఎం రమణయ్య, ఈ కోదండరామిరెడ్డి, చిన హజరత్‌ దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T22:42:35+05:30 IST

Read more