‘తమ్మవరం’ను వీడని గ్రహణం

ABN , First Publish Date - 2022-04-11T05:22:07+05:30 IST

తమ్మవరం ఎత్తిపోతల పథకానికి గ్రహణం వీడటంలేదు.

‘తమ్మవరం’ను వీడని గ్రహణం
చిల్లచెట్లతో మూసుకుపోయిన తమ్మవరం 2 ఎత్తిపోతల పథకం ప్రాంతం

కదలని పైపులైన్ల నిర్మాణం

రైతులకు తప్పని ఎదురుచూపులు

నెరవేరని లక్ష్యం

మేదరమెట్ల, ఏప్రిల్‌ 10: తమ్మవరం ఎత్తిపోతల పథకానికి గ్రహణం వీడటంలేదు. రూ.8 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన పంపులు, మోటార్లు ఉన్న ఆయక ట్టుకు సాగునీరు అందడం లేదు. గత 20 ఏళ్లగా సా గునీటికోసం ఎదురు చూస్తున్న రైతాంగం ఆశలు ఇప్పటికీ ఫలించలేదు. ప్రజా ప్రతినిధులు, అధికారు లు ఈ ఎత్తిపోతల గురించి సరైన శ్రద్ధ పెట్టి ఉంటే పథకం ఇన్నాళ్ళు మూలనపడేది కాదు. 

24 ఏళ్ల క్రితం కొరిశపాడు మండలంలో తమ్మవ రం వద్ద గుండ్లకమ్మ రిజర్వాయర్‌పై  తమ్మవరం 2 ఎత్తిపోతల పథకం నిర్మించారు. ప్రారంభోత్సవానికి నో చుకోకుండా, ఆయకట్టుకు సరిగ్గా నీరు అందించకుం డా మరమ్మతులకు గురైంది. 1997లో రూ.7 కోట్ల 76 లక్షల అంచానాతో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అ ప్పటి ఎమ్మెల్యే డాక్టర్‌ బాచిన చెంచు గరటయ్య నిధు లు మంజూరు చేయించారు. 4,900 ఎకరాల ఆ యక ట్టుకు నీరు అందించే విధంగా ఎత్తిపోతలను డిజైన్‌ చేశారు. 2008లో గుండ్లకమ్మ రిజర్వాయర్‌ పూర్తి కావ డంతో ఈ ఎత్తిపోతలను పునర్నిర్మించారు. ఇందులో భాగంగా ఎత్తిపోతలను ఎఫ్‌ఆర్‌ఎల్‌ 14.5 వద్ద ఏర్పా టుచేయిండంలో అప్పటి ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి కీలక పాత్ర పోషించారు. ఎన్నికలు రావ డం, పునర్నిర్మాణానికి చాలా సమయం పట్టింది. 2016 నాటికి పనులు పూర్తరునాఆ ఆయకట్టుకు సా గునీరు అందించలేకపోయారు. ఎప్పుడో 2003లో రైతు ల అనుమతితో ఏర్పాటు చేసిన సాగునీటి కాలువలు పూర్తిగా శిథిలమయ్యాయి. దీంతో 2018లో ప్రస్తుత ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ పైపు లైన్ల నిర్మాణా నికి రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ.11 కోట్లు మంజూరు చేయించారు. కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టారు. ఎన్నికలు రావడంతో పనులు అగిపోయాయి. అప్పుడు అగిపోయిన పనులు ఇప్పటికీ మొదలు కాలేదు. అలా గే, ఎత్తిపోతల పథకం వద్దకు వెళ్లేందుకు వీలు లేకుం డా చుట్టూ చిల్ల చెట్లు దట్టంగా పెరిగి అడవిని తల పిస్తున్నాయి. 

 ఆయకట్టులో ప్రధాన సమస్యగా ఉన్న కాలువల స్థానంలో పైపులైన్లు ద్వారా మాత్రమే ఆయకట్టు మొ త్తానికి నీరు అందించవచ్చునని ఐడీసీ అధికారులు తెలుపుతున్నారు. రైతులతో కమిటీ ఏర్పాటుచేసి ఎత్తి పోతలను నడుపుతామని చెబుతున్న అధికారులు ప్రభుత్వాలు మారినప్పుడల్లా కమిటీలను మార్చి ఆ యకట్టులోని రైతులను గందరగోళానికి గురి చేస్తున్నా రు. 11 కోట్ల రూపాయల పైపులైన్లు పనులు దక్కిం చుకున్న కాంట్రాక్టర్‌తో మాట్లాడి ఇప్పటికైనా పనులు ప్రారంభించడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు కృ షి చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఈ ఎత్తిపోతలతో సాగునీరు అందడం వలన ఈ ప్రాంత రైతాంగానికి ఎంతోమేలు చేకూరుతుంది. ఈ వేసవిలో నైనా పైపులైన్లు నిర్మాణ పనులు పూర్తి చేసి సాగునీ రు అందించాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2022-04-11T05:22:07+05:30 IST