ఉత్సాహంగా బండలాగుడు పోటీలు

ABN , First Publish Date - 2022-05-24T05:36:00+05:30 IST

మండలంలోని అయ్యలూరివారిపల్లి గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా ఎడ్ల బండలాగు పోటీలు సోమవారం ఉత్సాహంగా సాగాయి.

ఉత్సాహంగా బండలాగుడు పోటీలు
పోటీలను తిలకిస్తున్న ప్రజలు


సీఎస్‌పురం, మే 23 : మండలంలోని అయ్యలూరివారిపల్లి గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా ఎడ్ల బండలాగు పోటీలు సోమవారం ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీలలో గిద్దలూరు మండలం బురుజుపల్లి గ్రామానికి చెందిన యరమల సోహిత్‌రెడ్డి ఎడ్లు 1629 అడుగుల దూరం లాగి మొదటి బహుమతిగా రూ.45వేలు గెలుపొందాయి. పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామానికి చెందిన ముద్దపాటి శ్రీనువాసులు ఎడ్ల జత 1322 అడుగుల దూరం లాగి రెండవ బహుమతిగా రూ.30వేలు, గిద్దలూరు గ్రామానికి చెందిన దుర్వేసులు నారాయణ ఎడ్ల జత 815 అడుగులు లాగి మూడవ బహుమతిగా రూ.15వేలు, కడప జిల్లా కాశీనాయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన కామిని ప్రతాప్‌రెడ్డి ఎడ్ల జత నాలుగవ బహుమతిగా రూ.10వేలు గెలుచుకున్నాయి. ఈ పోటీ లను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రజలు భారీగా తరలివచ్చారు. విజేత లకు నిర్వాహకుల చేతులమీదుగా బహుమతులు అందజేసారు.  పోటీలను వైసీపీ నియోజకవర్గ నాయకుడు ముత్యాల నారాయణరెడ్డి  ప్రారంభిం చారు.  ముత్యాల సుబ్బారెడ్డి, భూమిరెడ్డి వెంకటరెడ్డి, సమన రమణయ్య, ముత్యాల రమణారెడ్డి, భూమిరెడ్డి రామిరెడ్డి విజేతలైన ఎడ్ల యజమానుల కు బహుమతులను అందజేశారు. 


Read more