విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌ మృతి

ABN , First Publish Date - 2022-10-04T05:39:21+05:30 IST

విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌ మృతి

విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌ మృతి
ఏరియా హాస్పిటల్‌లో సామ్యేల్‌ మృతదేహం

చీరాలటౌన్‌, అక్టోబరు 3: గ్రామంలో విద్యుత్‌ మరమ్మతులు చేస్తుం డగా చోటుచే సుకున్న ప్రమాదంలో  ప్రయివేట్‌ ఎలక్ర్టిషియన్‌ మృతి చెందాడు. ఈసంఘటన సోమవారం మధ్యాహ్నం విజయనగర్‌ కా లనీలో చోటుచేసుకుంది. అందిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన ప్రయివేట్‌ ఎలక్ర్టిషియన్‌ కాకాణి సా మ్యేల్‌(35)కు భార్య జయల క్ష్మి, ముగ్గురు కుమార్తెలు సంతానం. ప్రయివేట్‌ కాం ట్రాక్టర్‌ వద్ద ఆయన రోజు వారీ కూలీగా పనిచేస్తు న్నా డు. ఈక్రమంలో గ్రామంలో విద్యుత్‌ మరమ్మతులు చే స్తుండగా స్తంభంపై ఉన్న సామ్యేల్‌కు విద్యుత్‌ ప్రమా దం సంభవించింది. విద్యు త్‌ తీగలకు వేలాడుతుండ గా గమనించిన సహచరు లు వెంటనే వి ద్యుత్‌ అధికారుల కు సమచారం అందించి విద్యుత్‌ నిలిపివేశారు. అ నంతరం తీగలకు వేలాడుతున్న సా మ్యేల్‌ను కిందకు దించి చీరాల ఏరియా వైద్య శాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్ప టికే మృతి చెందినట్టు తెలిపారు. రెండవ పట్ట ణ ఎస్సై సురేష్‌ కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేస్తున్నారు.

ఒకవైపు విద్యుత్‌ పనులు జరుగుతుండగా విద్యుత్‌ ఎందుకు నిలుపలేదంటూ మృతుని కుటుంబసభ్యులు, విజ యనగర్‌ కాలనీ గ్రామస్థులు చీరాల ఏరియా వైద్యశాల వద్ద ఆందోళ నకు దిగారు. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు. కాంట్రాక్టర్‌పై అధికారులు చర్యలు తీసుకోకుంటే ఆందో ళన ఉధృతం చేస్తామని రించారు. ఎస్సై సురేష్‌ వారికి సర్దిచెప్పడంతో  ఆందోళన విరమించారు.

Read more