గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2022-11-12T01:29:58+05:30 IST

గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా తెలుసుకున్న అనంతరం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, మార్కాపురం సబ్‌కలెక్టర్‌ మాధవన్‌ అన్నారు.

గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి

రాచర్ల, నవంబరు 11 : గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా తెలుసుకున్న అనంతరం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, మార్కాపురం సబ్‌కలెక్టర్‌ మాధవన్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని జెపుల్లలచెరువు గ్రామపరిధిలోని ఎస్టీ చెంచుకాలనీ సందర్శించారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర కాలినడక వెళ్లి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్టీ కాలనీకి చెందిన లక్ష్మీ వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. గ్రామానికి దగ్గరలో ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పగా తాము ఇక్కడే ఉంటామని గిరిజనులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తమకు వ్యవసాయానికి సంబంధించిన భూములు, ఇళ్ళస్థలాలు ఇప్పించాలని కోరగా వాటిని విచారణ జరిపి చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కవితాచౌదరి, తహసీల్దార్‌ దిలీప్‌కుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ భారతీభాయి, ఆర్‌ఐ గంగిరెడ్డి, వీఆర్‌వో రంగస్వామి, సర్పంచులు షేక్‌ ఖాశింభీ, గోతం నారాయణ, ఎస్‌ఐ మహేష్‌, సర్వేయర్‌ సిలార్‌సాహెబ్‌, తదితరులు పాల్గొన్నారు. అనంతరం యడవల్లికి వెళ్లి జాతీయ రహదారి భూముల ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు.

కంభం : రైల్వే డబుల్‌ లైన్‌ నిర్మాణంలో గృహాలు కోల్పోతున్న బాధితుల వివరాలను సబ్‌ కలెక్టర్‌ సేతుమాధవన్‌ కంభం రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం సాయంత్రం చిన్నకంభం పంచాయతీ పరిధిలో రైల్వే డబుల్‌ లైన్‌ నిర్మాణంలో ఎంత మేర భూములు, గృహాలు పోతాయో అడిగి తెలుసుకున్నారు. డబ్లింగ్‌లో గృహాలు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ మార్గాలను, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయాన్ని చేస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రవి, సర్వేయర్‌ నాగేశ్వర్‌రెడ్డి, పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T01:29:58+05:30 IST

Read more