టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-08-17T05:48:19+05:30 IST

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామ చర్ల జనార్దన్‌ పిలుపునిచ్చారు.

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి

రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల  పిలుపు


ఒంగోలు(నగరం), ఆగస్టు 16: తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామ చర్ల జనార్దన్‌ పిలుపునిచ్చారు. మంగళవారం  కొత్తపట్నంలో జరిగిన పార్టీ కార్యక ర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్లస్టర్‌ కమిటీలు, బూత్‌ కమిటీలు ని యామకాలు ఒంగోలు నియోజకవర్గంలో  పూర్తి చేశామన్నారు. కొత్తపట్నం మం డలంలో అభివృద్ధి తెలుగుదేశం హయాంలోనే జరిగిందని ఆయన చెప్పారు. ఎన్ని కల సమయంలో పార్టీ శ్రేణులు పకడ్బందీగా వ్యవహరించాలని దామచర్ల సూ చించారు. అనంతరం వైసీపీకి చెందిన నలుగురు నాయకులు పార్టీలో చేరగా వా రికి తెలుగుదేశం కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల అ ధ్యక్షుడు శ్రీనివాసరావు, జిల్లా నాయకుడు గేనం సుబ్బారావు, కత్తి పద్మ, మేకల జక్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read more