చేయూత నిధులను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-27T07:15:05+05:30 IST

ప్రభుత్వం చే యూత ద్వారా మహిళలకు అందించే నగ దును తమ వ్యక్తిగత అ వసరాలకు కాకుండా వారి కుటుంబ ఆర్ధిక అభివృద్దికి వినియోగం చుకోవాలని ఎదగాలని రాష్ట్ర శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాచిన కృష్ణచైతన్య అన్నారు.

చేయూత నిధులను సద్వినియోగం చేసుకోవాలి
చెక్కులను అందజేస్తున్న శాప్‌నెట్‌ చైర్మన్‌ కృష్ణ చైతన్య

శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య

అద్దంకిటౌన్‌, సెప్టెంబరు 26: ప్రభుత్వం చే యూత ద్వారా మహిళలకు అందించే నగ దును తమ వ్యక్తిగత అ వసరాలకు కాకుండా వారి కుటుంబ ఆర్ధిక అభివృద్దికి వినియోగం చుకోవాలని ఎదగాలని రాష్ట్ర శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాచిన కృష్ణచైతన్య అన్నారు. సోమవారం స్థానిక వెలుగు కార్యాలయం ఆవరణలో వైఎస్‌ఆర్‌ చేయూత 3వ విడత సంబరాల కార్యక్రమం లో కృష్ణచైతన్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.., గత ప్రభుత్వం డ్వాక్రా మహిళల రుణాలు అన్ని మాఫీ చేస్తామని చెప్పి చేయకుండా మోసం చేశారన్నారు. ప్రతిపక్ష నాయకులకు ఏమి మాట్లాడానికి లేక ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. గ్రామ సచివాల యాలను ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచారన్నారు. కొంత మందికి అర్హత ఉండి కూడా పథకాలు అమలు కాకపోవడం వాస్తవమేనని, సాంకే తిక సమస్యలు పరిష్కారం అయితే వారికి లబ్ధి చేకూరుతుందన్నారు. అద్దంకి మండలం లో 2467 మంది చేయూత పథకం ద్వారా లబ్ధిపొందారని వాటితో అభి వృద్ది చెందాల న్నారు. అనంతరం డ్వాక్రా మహిళలకు చేయూత చెక్కును అందజేశారు. ఏపీఎం సీహెచ్‌ కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ అవిశన జ్యోతి, ఎంపీడీవో వి.ప్రద్యుమ్న కుమార్‌, ఏసీ రవికుమార్‌, వైసీపీ మండల కన్వీనర్‌ జ్యోతి హనుమంతరావు, ప్రభాకర్‌రెడ్డి, భువనేశ్వరి, కాకాని రాధాకృష్ణ మూర్తి, సందిరెడ్డి రమేష్‌, పలు గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు. 

పేదల అభివృద్ధే ధ్యేయం

మేదరమెట్ల : రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర శాస్‌నెట్‌ చైర్మన్‌, అద్దంకి వైసీపీ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. సోమవారం కోరిశపాడు మండలంలోని రాచపూడిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్ర మంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతా యన్నారు.  కార్యక్రమంలో ఎంపీపీ సాధినేని ప్రసన్నకుమారి, ఎంపీడీవో సురేష్‌బాబు, వీ రగంథం పాండురంగారావు, వైసీపీ మండల కన్వీనర్‌ సాధినేని మస్తాన్‌రావు, పమిడిపాడు మాజీ సర్పంచ్‌ రావి శ్రీధర్‌, బుట్టి రక్షణ, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2022-09-27T07:15:05+05:30 IST