సచివాలయ సిబ్బందిపై డీఎల్‌డీవో ఆగ్రహం

ABN , First Publish Date - 2022-09-28T04:08:52+05:30 IST

తాళ్లూరు-2 సచివాలయ సిబ్బంది పని తీరు పట్ల ఒంగోలు డివిజన్‌ లెవల్‌ డవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణాధికారి టి.ఉషారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సచివాలయ సిబ్బందిపై డీఎల్‌డీవో ఆగ్రహం
రికార్డులను పరిశీలిస్తున్న డీఎల్‌డీవో ఉషారాణి

 కార్యదర్శికి మెమో ఇవ్వాలని ఎంపీడీవోకు ఆదేశం

తాళ్లూరు, సెప్టెంబరు 27: తాళ్లూరు-2 సచివాలయ సిబ్బంది పని తీరు పట్ల ఒంగోలు డివిజన్‌ లెవల్‌ డవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణాధికారి టి.ఉషారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళ్లూరు-2 సచివాలయాన్ని ఆమె మంగళవారం ఆక స్మికంగా తనిఖీ చేశారు. సచివాలయం నిర్వహణ తీరు సక్రమంగా లేక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సచివాలయం ఎక్కడ వుందో తెలిసేలా ఫ్లెక్సీ కూడా లేకపోవడం, నోటీసు బోర్డు ఏర్పాటు చేయకపోవడం,   సిబ్బంది అర్హతను తెలిపే బోర్డులు కూడా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. కార్యాలయంలో సిబ్బంది క్రమపద్ధతిలో కూర్చోక పోవడం, ప్రభుత్వం సచివాలయ సిబ్బందికి సమకూర్చిన యూనిఫాంను వాడక పోవటం,  గర్తింపు కార్డులు వేసుకో పోవడటంపై ఆమె ప్రశ్నించారు.  విజిట్‌ రిజిస్టర్‌ నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై కార్యదర్శిని నిలదీశారు. డిజిటల్‌ ఉద్యోగి సెలవు పెడితే ఆ బాధ్యతలను మరొకరికి ఎందుకు అప్పజెప్పక పోవడానికి కారణం ఏంటన్నారు.  దీనిపై కార్యదర్శి చిరంజీవి ఎలాంటి సమాధానం ఇవ్వక పోవడంపై డీఎల్‌డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీడీవో కార్యాలయానికి వెనుక ఉన్న సచి వాలయంలోనే సిబ్బంది ఇలా ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదని,  సచివాలయంలో తనిఖీలు నిర్వహించి నివేదిక పంపాలని ఎం పీడీవోకు సూచించారు. ఆర్బీకేల్లో సేవలను రైతులను అడిగి తెలుసుకుని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న తాళ్లూరు-2 సచివాలయ కార్యదర్శికి మెమో జారీ చేయాలని ఎంపీడీవో యుగకీర్తిని ఆదేశించారు. ఆమెతోపాటు ఈవోఆర్డీ ఎన్‌యూ ప్రసన్నకుమార్‌, సిబ్బంది ఉన్నారు.

పారిశుధ్యం మెరుగుపర్చండి

ముండ్లమూరు : మండలంలోని పలు గ్రా మాల్లో సీజనల్‌ వ్యాధులు, డెంగ్యూ జ్వరాలు సోకి ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున పా రిశుధ్య పనులు మెరుగుపర్చాలని  జిల్లా వార్డు, సచివాలయాల ప్రత్యేక అధికారి,  డీఎల్‌డీవో పీ ఉషారాణి ఆదేశించారు. ఆమె మంగళవారం మండలంలోని పసుపుగల్లు, వేములబండ గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీడీవో బీ రామాంజనేయులు, ఈవోఆర్‌డీ ఓబులేసు, పంచాయతీ కార్యదర్శులు హరిబాబు, స్వర్ణలత ఉన్నారు. 

Updated Date - 2022-09-28T04:08:52+05:30 IST